బిజినెస్

భీమవరంలో హోటళ్లన్నీ హౌస్‌ఫుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఒకవైపు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లుచేస్తుండగా, మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం తమ వంతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గానికి ఈ సారి రాష్టస్థ్రాయి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని భీమవరం అసెంబ్లీ సిగ్మెంట్ నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నరసాపురం లోక్‌సభ స్థానం నుండి అయన సోదరుడు నాగబాబు పోటీచేయడమే ఈ ప్రాధాన్యానికి కారణం. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ల ఓట్ల లెక్కింపు భీమవరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు భీమవరం విచ్చేసే కీలక నేతల కోసం అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని అన్ని హోటళ్లలోని గదులను ఇప్పటికే రిజర్వు చేసేసుకున్నారు. 23వ తేదీన కౌంటింగ్ కావడంతో 22వ తేదీ నాటికే నాయకులు తమ అనుచరులతో కలిసి భీమవరం చేరుకోనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీన భీమవరం చేరుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏడు నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిస్తే విందు పార్టీలు చేసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల పోరులో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం, బాధలను పంచుకునే విధంగా పార్టీలు చేసుకునే అవకాశం లేకపోలేదు. దీన్ని బట్టి చూస్తే ఫలితం ఎలా ఉన్నా రెండు రోజుల పాటు భీమవరం నేతలు, వారి అనుచరులతో కిటకిటలాడటం ఖాయమని తెలుస్తోంది. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసివేయనున్న నేపథ్యంలో కొందరు నేతలు ముందుగానే అవసరమైన మద్యాన్ని సైతం సమకూర్చుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికే పలు పార్టీల నేతలు, కార్యకర్తల అవసరాల దృష్ట్యా భారీ ఎత్తున మద్యం నిల్వలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈవీఎంలలో లెక్కింపు పూర్తయిన తర్వాత వివి ప్యాట్ల లెక్కింపు చేపట్టాకే తుది ఫలితాన్ని అధికారికంగా ఈసి ప్రకటించనున్న నేపథ్యంలో అందరిలోనూ టెన్షన్ మరింత పెరిగిపోనుంది. ఈ ఉత్కంఠ నుంచి బయట పడేందుకు వీలుగా తగిన ఏర్పాట్లలో రాజకీయ పార్టీల నేతలు, అనుచరులు నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తెలంగాణ నుండి తరలివస్తారని సమాచారం.
ఆయన కోసం భీమవరంలో కొంత కాలంగా పనిచేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, అకౌంటెంట్స్, విద్యార్థులు, తెలంగాణ పార్టీ ప్రతినిధులు, అక్కడ ఫ్యాన్స్ అంతా భీమవరం చేరుకోనున్నారు. వీరంతా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫలితాల కోసం వేచి చూడనున్నారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రమే హోటళ్లలో గదులు లభించగా, చాలామందికి దొరకలేదు. దీనితో పరిచయం ఉన్న పవన్ ఫ్యాన్స్, వారి బంధువుల ఇళ్ళ వద్ద ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.