బిజినెస్

ఎగ్జిట్‌పోల్స్‌తో కంపెనీలకు లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 20: ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్‌మార్కెట్‌లో నెలకొన్న ఆనందదాయక పరిణామాలతో మదుపర్ల ఐశ్వర్యం సోమవారం సుమారు 5.33 లక్షల కోట్లమేర పెరిగింది. సెనె్సక్స్ రికార్డు స్థాయిలో 1,422 పాయింట్ల ఆధిక్యతను తాకడంతో బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ ఒక్క సారిగా రూ. 5,33,463.04 కోట్లు పెరగడం విశేషం. సోమవారం వాణిజ్య సమయం ముగిసే సమయానికి బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ మొత్తం రూ. 1,51,86.312.05 కోట్లకు చేరింది. గత శుక్రవారం వాణిజ్య వారం ముగిసే సమయానికి ఈ మొత్తం రూ. 1,46,58,709.68గా ఉండేది. ఇలా దేశీయ స్టాక్స్ వరుసగా మూడు రోజులపాటు అందుకోవడం గమనార్హం. మొత్తం ఈ మూడు రోజుల్లో బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ మొత్తం రూ. 7.48 లక్షల కోట్లు ఎగబాకింది. సెనె్సక్స్ 39,300 మార్కును, నిఫ్టీ 11,800 మార్కును తాకడంతో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా మిగిలిన అన్ని సూచీల వాటాలు భారీ లాభాలను అందుకున్నాయి. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి కేంద్రం లో అధికారాన్ని నిలుపుకుంటుందన్న అంచనాలు ఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్‌తో మరింతగా బలపడడం వల్లే దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూలత నెలకొందని కోటక్ సంస్థాగత ఈక్విటీస్ విభాగం నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈనెల 23న మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతాయన్న ఆశాభావాన్ని ఆ అధ్యయన నివేదిక వ్యక్తం చేసింది.