బిజినెస్

రికార్డు స్థాయికి దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) కేంద్రంలో మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు సోమవారం దూకుడును ప్రదర్శించి రికార్డు స్థాయి ఆధిక్యతను నమోదు చేశాయి. సెనె్సక్స్ ఏకంగా 1,422 పాయింట్లు ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 421 పాయింట్ల ఆధిక్యతకు చేరింది. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 1,421.90 పాయింట్ల ఆధిక్యతతో 3.75 శాతం లాభపడి 39,352.67 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ 39,412.56 పాయింట్ల అత్యధిక స్థాయిని, మరో దశలో 38,570.04 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. కాగా నీఫ్టీ సైతం 421.10 పాయింట్ల ఆధిక్యతతో 3.69 శాతం లాభపడి 11,828.25 మార్కు వద్ద స్థిరపడింది. కాగా సార్వత్రిక ఎన్నికల ఏడు విడతల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈనెల 23న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ 272 సీట్లను దాటి 300కు పైగా సీట్లు వస్తాయని ఆదివారం కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం జరిగింది. ఇలా స్థిరమైన ప్రభుత్వం కొనసాగితే ఎన్‌డీఏ తొలిదఫా పాలనతో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలవుతాయన్న విశ్వాసం మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇలావుండగా సోమవారం సెనె్సక్స్ ప్యాక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్ ఎం, మారుతీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 8.64 శాతం లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్‌లు నష్టపోయాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ సోమవారం 64 పైసలు బలపడి మొత్తం 69.59 రూపాయలుగా ట్రేడయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు సైతం 1.40 శాతం పెరిగి బ్యారెల్ 72.61 డాలర్ల వంతున ట్రేడైంది. ఇలావుండగా సోమవారం ప్రారంభ డీల్స్‌లో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతోనూ, ఐరోపా మార్కెట్ సూచీలు నష్టాలతోనూ సాగాయి.