బిజినెస్

సర్కారుపై అప్పుభారం రూ. 1,80,000 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై అప్పు్భరం మొత్తం రూ.1,80,000 కోట్లకు చే రిందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు తెలిపారు. సచివాలయంలో మంగళవా రం జరిగిన సమావేశంలో, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, నియమావళికి లోబడే అప్పు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో చేసిన అప్పు రూ.లక్ష కోట్లని వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం (్ఫస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జె ట్ మేనేజ్‌మెంట్) చట్టానికి లోబడి అప్పు తీసుకుంటున్నామన్నారు. జీఎస్‌డీపీలో 3శాతం అప్పు తీసుకునేందుకు వీలుందని, ఇందుకు అనుగుణం గా 2019-20 సంవత్సరానికి రూ.29,750 కోట్ల అప్పు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ప్రభుత్వం విడుదల చేసే బాండ్లు సునాయాసంగా విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. జీఎస్‌డీపీలో మన అప్పు 25 శాతంలోగానే ఉందని, ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు 35 శాతం నుండి 40 శాతం వరకు అప్పు ఉందని వివరించారు. రాష్ట్ర తెస్తున్న రుణాలన్నీ అభివృద్ధి పనుల కోసమే వినియోగిస్తున్నామని వివరించారు.