బిజినెస్

అమెరికా ఆంక్షల ప్రభావంతో హవాయ్ సెల్‌ఫోన్ల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 22: చైనాకు చెందిన ‘హవాయ్’ కంపెనీ ద్వారా తయారవుతున్న కొత్త సెల్‌ఫోన్లను తమ మార్కెట్‌లో ప్రవేశపెట్టడాన్ని ఆలస్యం చేయనున్నట్టు జపాన్‌కు చెందిన రెండు అగ్ర మొబైల్ ఫోన్ మార్కెటింగ్ సంస్థలు బుధవారం నాడిక్కడ ప్రకటించాయి. చైనాకు చెందిన టెలికాం టెక్ దిగ్గజం హవాయ్‌పై అమెరికా అంక్షల నేపథ్యంలో జపాన్ కంపెనీల ప్రకటన ప్రాథాన్యతను సంతరించుకుంది. జపాన్‌కు చెందిన ఈ రెండు కంపెనీలు కెడీడీఐ, సాఫ్ట్‌బ్యాంక్ కార్ప్‌లు ఆ దేశపు నంబర్-2,3 లుగా గణుతికెక్కాయి. ‘అమెరికా ఆంక్షలకు సంబంధించిన ప్రభావం ఏ మేరకు ఉందో అంచనావేసేందుకు హవాయ్‌కు తాము అవకాశం కల్పిస్తున్నామని బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఆ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ఇదే తరహా విధానానే్న అనురించాలన్న ప్రతిపాదనను తాము కూడా పరీశీలిస్తున్నామని జపాన్‌కు చెందిన అతిపెద్ద సంస్థ ‘ఎన్‌టీటీ డొకోమో’ సైతం ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ ఆధ్వర్యంలో హవాయ్‌లో తయారైన సరికొత్త హ్యాండ్‌సెట్‌ను శుక్రవారం నాడిక్కడ విడుదల చేయాల్సివుంది. ఐతే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తమ వినియోగదారులు భద్రతను ఆస్వాదించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు చేపట్టామని కంపెనీ అధికార ప్రతినిధి హిరోయికీ మిజుకామి తెలిపారు. అసలు మేము ఈ సెల్‌ఫోన్లు విక్రయించాలా లేదా అన్నదానిపై సైతం స్పష్టత లేదని ఆయన అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతోప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ, నంబర్ వన్ టెలికాం నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ హవాయ్ భవితవ్యం అయోమయంలో పడింది. ఈ క్రమంలో హవాయ్‌పై ఆంక్షల అమలును 90 రోజులపాటు వాయిదా వేశామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చర్చల ద్వారా మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించడం జరిగింది.