బిజినెస్

ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలకు యూఏఈ వీసా సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 22: ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలకు తొలిసారిగా 10 సంవత్సరాల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా దక్కింది. గల్ఫ్ దేశాల సుదీర్ఘ నివాస పథకం కింద ఈ ప్రత్యేక వీసా జారీ అయింది. ఈపథకం గల్ఫ్ దేశాల్లో పెట్టుబడిదారులు, విద్యార్థుల ప్రోత్సాహానికి ఉద్దేశించింది. మీడియా కథనాల మేరకు రీగల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ వాసుష్రాఫ్, ఖుషీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, అల్ నిసార్ సినిమా ఫిల్మ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖుషీ ఖట్వానీలకు ఈ ప్రత్యేక వీసా గౌరవం దక్కింది. వీరి పాస్‌పోర్టులపై నివాసాలు, విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (జీడీఆర్‌ఎఫ్‌ఏ) స్టాంపులతో కూడిన సంతకాలతో ఈ ప్రత్యేక హోదా జారీ అయింది. గత జనవరి నుంచి ఈ పదేళ్ల వీసా పథకం అమలులోకి వచ్చింది. అరబ్ సైంటిస్టులు, వైద్య రంగ నిపుణులు ప్రప్రథమంగా ఈ పథకం కింద ఎంపికయ్యారు. కాగా ఇలాంటి ప్రోత్సాహకాల ద్వారా దేశంలో పెట్టుబడులు పెరిగేందుకు, ఆర్థికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని ఈ ప్రత్యేక వీసా సదుపాయం పొందిన భారతీయ వాణిజ్యవేత్త ష్రాఫ్ ఈ సందర్భంగా గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెక్స్‌టైల్స్ రంగంలో పేరెన్నికగన్న ష్రాఫ్ భారత ప్రభుత్వం ప్రవాస భారతీయులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ను అందుకున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు ‘2020 ఎక్స్‌పో’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని, దానిద్వారా యూఏఈ ప్రభుత్వం అత్యుత్తమ ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు. మరి కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు సైతం ఈ ప్రత్యేక వీసా సదుపాయం పొందుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా సినిమాలు, జువలెరీ వ్యాపారంలో దిట్టగా పేరున్న ఖట్వానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రత్యేక గౌవరం ద్వారా నేను దేశానికి చెందిన వాడనన్న నమ్మకం మరింత దృఢమవుతుందని అన్నారు. ఇందువల్ల స్వేచ్ఛాయుతంగా వాణిజ్యాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. రెండు, లేదా మూడేళ్లకు ఓసారి వీసాను రెన్యువల్ చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారికి ఇలాంటి దీర్ఘకాలిక సదుపాయాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఇలావుండగా యూఐఈ ప్రభుత్వం మంగళవారం ఒక పర్మనెంట్ రెసిడెన్సీ పథకాన్ని, తద్వారా ‘గోల్డెన్ కార్డు’ సదుపాయాన్ని అమలులోకి తెచ్చింది. పెట్టుబడిదారులను, వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ కార్డు పొందిన వారికి, వారి కుటుంబీకులకు ప్రత్యేక ఆకర్షణీయమైన గౌరవ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. పర్యావరణాన్ని, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.