బిజినెస్

టారిఫ్ వార్‌తో మందగించిన షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, మే 23: అమెరికా, చైనా మధ్య తలెత్తిన టారిఫ్ పెంపువివాదం ప్రపంచ షేర్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గురువారం షేర్లు చతికిలపడ్డాయి. అలాగే యురోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రతికూల ప్రభావం చూపాయని విశే్లషకులు పేర్కొన్నారు. మాన్యుఫాక్చరింగ్, సర్వీసుల ఇండెక్స్ మందగించింది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.6 శాతానికి పడిపోయి 5,294.51 వద్ద నిలిచింది. జర్మనీ డీఏఎక్స్ 1.5 శాతానికి క్షీణించి 11,985.73 వద్ద ఆగింది. బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 1.1 శాతం నష్టపోయింది. ప్రధాని థెరిసామే బ్రిగ్జిట్‌ను ఎంపీలు తిరస్కరించిన నేపథ్యంలో ఆ షేర్లు 7,250.73 వద్ద నిలిచాయి. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ వద్ద 0.7 శాతం క్షీణించాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 0.7 శాతం పడిపోయాయి. ఈనెలారంభంలో అమెరికా, చైనా మధ్య 11వ వాణిజ్య చర్చలు ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ముగిశాయి. తదుపరి చర్చలు ఎప్పుడో స్పష్టం కాలేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్ పెంచేసింది. వాటి విలువ 250 బిలియన్ యూఎస్ డాలర్లు.
చైనా కూడా 110 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ పెంచేసింది.