బిజినెస్

‘సింహాసన క్రీడ’లో విజేత మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తున్నట్టు గురువారం నాటి ఫలితాల్లో వెల్లడి కావడంతో సామాజిక మాధ్యమాలు దీన్నో ‘సింహాసన క్రీడ’గా అభివర్ణించాయి. ప్రధాని మోదీని దిగ్విజేతగా పేర్కొన్నాయి. ప్రధానంగా ఈక్రీడకు ఓట్ల లెక్కింపు రోజును ఫైనల్స్‌గా పేర్కొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుండడాన్ని ట్విట్టర్ వినియోగదారులు తమకిష్టమైన రీతిలో వర్ణించడం కనిపించింది. ప్రధానంగా విడతల వారీగా జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియను ‘వెస్టెరోసి జార్గోన్’ (సింహాసన క్రీడ)గా పేర్కొన్నాయి. నరేంద్ర మోదీని భారతీయతకు నిజమైన పాలకుడిగా, రాజ రక్షకుడిగా, దైవంగా, ఆపద్బాంధవుడిగా, వికాస కారకుడిగా, లౌకిక వాద శక్తులకు తండ్రిగా ఎవరికి తోచిన విధంగా వారు పేర్కొన్నారు. ‘మోదీ వస్తున్నాడు’ అంటూ కొన్ని ట్వీట్లు పేర్కొన్నాయి. ‘మళ్లీ మోదీ ప్రభంజనం వచ్చింది’ ‘మోదీ 2.0 స్వీప్’ ‘సింహాసన క్రీడ ముగిసింది’ ‘ఇక భారత్‌కు శుభాభినందనలు’ అంటూ మరో ట్వీట్ పేర్కొంది. ‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సంఖ్యలో పోటీ చేసిన మహిళలు ఈ ‘సింహాసన క్రీడ’లో అధికంగా నష్టపోయారని మరొకరు ట్వీటారు. 2011 నుంచి దేశ రాజకీయాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం గణనీయంగా పెరిగింది. ఏ ఎన్నికలు వచ్చినా ట్రెండ్‌ను ప్రచారం చేయడం సామాజిక మాద్యమాలకు ఓ సంస్కృతిలా మారింది.