బిజినెస్

పైకెగసి పతనమైన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఎన్నడూ లేని రీతిలో లాభాల బాటపట్టి, ఆతర్వాత అనూహ్యంకా పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఒకానొక దశలో వేయి పాయింట్లకు పైగా పెరిగిన సెనె్సక్స్ సూచీ 40 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీనితో బీఎస్‌ఈలో కొత్త రికార్డు నమోదైవుతుందనే అభిప్రాయం బలపడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే, లాభాల బాటపట్టిన స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ప్రభావం చూపాయి. దీనితో ఒక్కసారిగా పతనం మొదలైంది.
భారీ లాభాలు లేకున్నా, కనీసం స్వల్పంగా మెరుగుపడి, ముగుస్తుందనుకున్న సెనె్సక్స్ అందుకు భిన్నంగా 298.82 పాయింట్లు నష్టపోయి 38,811.39 పాయింట్లకు పడిపోయింది. వేదాంత కంపెనీ షేర్లు 5.53 శాతం నష్టపోయాయి. ఐటీసీ 3.69, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.94, టాటా మోటార్స్ 2.45, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న ఇండస్‌ఇండ్ షేర్లు 5.23 శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా 1.56, ఎస్ బ్యాంక్ 1.53, హీరో మోటార్స్ 1.51, పవర్‌గ్రిడ్ 1.29 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. ఇలావుంటే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 80.85 పాయింట్లు పతనం కావడంతో 11,657.05 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈలో భారీగా నష్టపోయిన వేదాంత షేర్లకు ఎన్‌ఎస్‌ఈలోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఈ షేర్లు 5.59 శాతం నష్టాలను చవిచూశాయి. ఇచర్ మోటార్స్ 4.19, ఐటీసీ 3.80, ఐటీసీ 3.18, బజాజ్ ఫిన్‌సర్వీస్ 2.60 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, అదానీ పోర్ట్స్ షేర్లు 5.84 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. జీ ఎంటర్‌టైనె్మంట్ 5.55, ఇండస్‌ఇండ్ 5.20, గ్రాసిమ్ 3.46, సిప్లా 2.21 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి.