బిజినెస్

జీవితకాల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం మళ్లీ దూకుడును ప్రదర్శించాయి. సెన్సెక్స్ 623 పాయింట్లు అదనంగా లాభపడి 39,434.72 పాయింట్ల రికార్డు స్థాయి గరిష్టానికి చేరింది. సార్వత్రిక ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ దిగ్విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవడంతో హామీ మేరకు స్థిరమైన విధాన నిర్ణయాలు జరుగుతాయన్న నమ్మకం మదుపర్లలో పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం ఏకంగా 187 పాయింట్లు లాభపడి 11,844.10 పాయింట్ల జీవిత కాల గరిష్టానికి చేరింది. కాగా ఈ వాణిజ్య వారమంతా అన్ని వర్గాలవారు ఎన్నికల ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో బీఎస్‌ఈలో 30 షేర్ల సెన్సెక్స్ మొత్తం 1,503 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సైతం 437 పాయింట్లు ఎగబాకింది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభం కాగానే ఈ రెండు సూచీలూ ఇంట్రాడేలో రికార్డు స్థాయి ఆధిక్యతను నమోదు చేశాయి. ఈక్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో స్వయంగా 300 సీట్లకు పైగా సాధించి 1984 తర్వాత ఒకదాన్ని మించి మరొకటిగా వరుసగా పూర్తి స్థాయి మెజారిటీని అందుకున్న ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. తొలి విడత ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను ఎన్‌డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందన్న కథనాలను విశ్లేషకులు వెలురించారు. దీంతో 26 స్టాక్స్ లాభపడగా, 4 కౌంటర్లలో నష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 5.09 శాతం లాభాలను సంతరించుకోగా, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, టాటా మోటార్స్ సైతం 4.60 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇంత ఊపులోనూ ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌యూఎల్ నష్టాలపాలయ్యాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ కదలికలు సానుకూల వాతావరణంలోనే 39,476.97 వద్ద ఆరంభమయ్యాయి. ఒక దశలో 39,476.97 పాయింట్ల గరిష్టానికి చేరిన ఈ సూచీ మరో దశలో 38,824.26 పాయింట్ల కనిష్టానికి దిగివచ్చింది. చివరిగా 623.33 పాయింట్ల ఆధిక్యంతో 1.61 శాతం లాభాలతో 39,434.72 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 11,844.10 పాయింట్ల వద్ద ఆరంభమై 11,859.00 పాయింట్ల గరిష్టాన్ని తాకి ఆ తర్వాత 11,658.10 పాయింట్ల కనిష్టానికి దిగివచ్చింది. చివరిగా 187.05 పాయింట్ల ఆధిక్యతతో 1.60 శాతం లాభపడి 11,844.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో రంగాల వారీగా అన్ని సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రధానంగా స్థిరాస్తి, కేపిటల్ గూడ్స్, పరిశ్రమలు, టెలికాం, వాహన రంగాలు సుమారు 4.25 శాతం అధికంగా లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు సైతం 2.43 శాతం అదనపు లాభాలను సంతరించుకున్నాయి. లార్జ్ క్యాప్ 1.61 లాభపడింది. మొత్తంగా బీఎస్‌ఈలో 1,827 స్టాక్స్ లాభపడగా, 695 స్టాక్స్ నష్టపోయాయి.
ఇక ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలనే నమోదు చేశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలను నిశితంగా పరిశీలిస్తున్న మదుపర్లు ఆచితూచి అడుగేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.