బిజినెస్

జీఎస్టీ రీఫండింగ్ ప్రక్రియ ఇకపై ఒకేచోట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రీఫండింగ్‌కు సంబంధించిన మంజూర్లు, ప్రాసెసింగ్ పనులు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియల్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించి పనితీరును వేగవంతం చేయడం ద్వారా ఎగుమతుల శాతాన్ని సైతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత అధికార వర్గాలు ఆదివారం నాడిక్కడ వెల్లడించాయి. ప్రస్తుతం జీఎస్టీ రీఫండింగ్‌కు సంబంధించిన ప్రక్రియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు పన్ను విభాగాల నియంత్రణలో ఉండగా వచ్చే ఆగస్టు నుంచి ఈ విధానంలో మార్పు చోటుచేసుకుంటుందని ఆ అధికారులు చెప్పారు. రెవిన్యూ శాఖ రూపొందించిన ఈ సరికొత్త విధానం ద్వారా పన్ను చెల్లింపుదారుడికి క్లెయిమ్ మంజూరైన వెంటనే అతనున్న ప్రాంత పరిధిలోని కార్యాలయం నుంచి పూర్తి స్థాయి రీఫండ్‌ను ఒకేసారి పొందవచ్చు. తదుపరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందాల్సిన పన్ను విభజన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో జీఎస్టీ రీఫండ్ కోసం సమీప కార్యాలయంలో అర్జీపెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ అధికారి 50 శాతం క్లెయిమ్‌ను, తదుపరి రాష్ట్ర పన్నుల శాఖ అధికారి మరో 50 శాతం క్లెయిమ్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన స్క్రూటినీ జరిగి ప్రక్రియ పూర్తవుతుంది. ఇదంతా జరగడానికి చాలా కాలయాపన జరుగుతోంది. ఇందువల్ల ప్రత్యేకించి ఎగుమతుల్లో ద్రవ్యలోటు సమస్య కూడా తలెత్తుతోందని ఆ అధికారి వివరించారు. అందుకే అన్ని ప్రక్రియలూ ఒకచోట జరిగే ఏకగవాక్షం లాంటి వ్యవస్థను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు. తద్వారా ఒకసారి రీఫండింగ్‌కు సంబంధించిన క్లెయిమ్ చేయగానే దాన్ని కేంద్ర, రాష్ట్ర అధికారులు సంయుక్తంగా పరిశీంచి, బేరీజువేసి, పూర్తి స్థాయి మంజూర్లు ఇస్తారు. పన్ను చెల్లింపుదార్ల ఇబ్బందులను తొలగించడంతోబాటు, ఎగుమతుల్లో ద్రవ్యలోటును నివారించి శీఘ్రతరం చేయాలన్నది కేంద్ర మంత్రిత్వ శాఖ లక్ష్యమని అధికారులు వివరించారు.
కేంద్ర, రాష్ట్రాలకు పన్ను విభజన ఇలా..
సరికొత్త విధానం మేరకు కేంద్ర వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలికి చెందిన బేరీజు డివిజన్ విభాగం మార్గనిర్దేశానుసారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను విభజన జరుగుతుంది. రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌కు సంబంధించిన 90 శాతం అంచనాలను రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు, మిగిలిన 10 శాతం అంచనాలను కేంద్ర శాఖ అధికారులు పూర్తి చేస్తారు. ఇందుకు సంబంధించి పన్ను విభజన ఇరు ప్రభుత్వాలకు 50-50 శాతం వంతున ఉంటుంది.