బిజినెస్

విజయవాడ - ముంబై విమాన సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మే 26: కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వాణిజ్యవేత్తల కలలు నేడు సాకారమయ్యాయని విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ - ముంబై నూతన విమాన సర్వీసును ఆయన జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ దేశ వాణిజ్య రాజధాని ముంబైకి నేరుగా విమాన సర్వీసు నడపాలని ఈప్రాంత వాణిజ్యవేత్తలు కోరుతున్నారన్నారు. ఇంతకాలానికి వారి నిరీక్షణ ఫలించిందన్నారు. ఈ విమాన సర్వీసు ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు ముంబైలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని తెలిపారు. 1.30 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరి 2.50 నిముషాలకు ముంబై చేరుకుంటుందన్నారు. స్పైస్ జెట్ ఎయిర్‌వేస్ నడిపే ఈ బోయింగ్ విమానంలో 156 మంది బడ్జెట్ క్లాస్ ప్రయాణికులతో పాటు బిజినెస్ క్లాస్‌లో 12 మందికి సిట్టింగ్ సదుపాయం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి మూడురోజులు ముంబైకి విమానాలు నడుపుతున్నప్పటికీ వారంలో అన్ని రోజులూ నడిపే ఈ విమానం వల్ల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. యూరప్, నార్త్ అమెరికా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందన్నారు. విమానం తొలిరోజు 80 మంది ప్రయాణికులతో ముంబై తరలివెళ్లిందని చెప్పారు. రాకేష్ గుప్తా అనే ప్రయాణికునికి తొలి బోర్డింగ్ పాస్‌ను మధుసూదనరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పైస్ జెట్ సంస్థ స్టేషన్ మేనేజర్ డీన్ డామినిక్ పాల్గొన్నారు.