బిజినెస్

భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్‌లో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన చర్యలపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంకు బృందం త్వరలో మరోసారి డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) అధికారులతో సమావేశం కానుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది కాలంలో చేపట్టిన చర్యల గురించి ఈ భేటీలో డిఐపిపి అధికారులు ప్రపంచ బ్యాంకు బృందానికి సమగ్రంగా వివరిస్తారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు బృందం డిఐపిపి అధికారులతో సమావేశం కావడంతో పాటు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ప్రభావం ఏమిటన్న దానిపై వివిధ భాగస్వాములతో చర్చిస్తుంది. వ్యాపారాన్ని సులభతరం చేసిన దేశాలకు 1 నుంచి 189 వరకు ర్యాంకులు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు ఇందుకోసం ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రక్రియను నిర్వహిస్తోంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన విషయం విదితమే. ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో మన దేశం మరింత ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఈ చర్యలు తోడ్పడతాయని ఆ అధికారి తెలిపారు.