బిజినెస్

సామాన్యుడికి పన్ను ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపుపరిమితిని మూడు లక్షల రూపాయలకు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. అలా చేయడం వల్ల దేశంలో వినిమయ సామర్ధ్యం, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. తొలిసారి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న లోక్‌సభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆమె వివిధ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో, పెట్టుబడిదారులు, వాటాదారులతో సంప్రదింపులు జరిపే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సీఐఐ, ఎఫ్‌ఐసీసీ వంటి పారిశ్రామిక చాంబర్లు ఇందుకు సంబంధించి సమగ్ర సూచనలతో కూడిన నివేదికలను ఇప్పటికే మంత్రిత్వ శాఖకు అందజేయడం జరిగింది. ప్రపంచ ఆర్థిక స్థితిగతులేవీ ప్రస్తుతానికి భారత్‌ను ప్రభావితం చేయనప్పటికీ కొన్ని సవాళ్లు తప్పడం లేదని, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్‌పై ఎలాంటి ఆశలూ లేవని పీడబ్ల్యుసీ ఇండియా వ్యక్తిగత పన్ను విభాగం భాగస్వామి, అధినేత కుల్దీప్ కుమార్ అభిప్రాపడ్డారు. గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పటికీ రూ. 5లక్షల వార్షికాదాయంపై పూర్తి పన్ను రిబేటు మంజూరు విషయంలో స్లాబ్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదని ఆయన గుర్తు చేశారు. గతంలో ఈ పన్ను రిబేటు రూ. 3.5 లక్షల వరకే ఉండేది ఈపరిమితిని రూ. 5లక్షలకు పెంచడం వల్ల అల్పాదాయ వర్గాలకు లబ్ధి చేకూరుస్తుందని ఆయన చెప్పారు. కాగా కొత్త బడ్జెట్‌లో వౌలక పన్ను మినహాయింపు పరిమితిని మరో రూ. 50వేలకు ( రూ. 2.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు) పెంచే అవకాశాలున్నాయని ఇదే జరిగితే రూ. 5లక్షల వరకు వార్షికాదాయంపై అందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు, అలాగే ఈ కేటగిరీకి 5 శాతం స్లాబ్‌ను సైతం రూ. 5 లక్షల నుంచి 7.5 శాతానికి పెంచుతూ పన్ను భారాన్ని 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సూచించారు. గృహ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలని, పన్ను చెల్లింపుదార్లకు రాయితీలు ఇవ్వాలని తద్వారా సొంత ఇంటికల నిజం చేసుకోవడానికి దోహదం చేయాలని ఈ ఆర్థిక నిపుణుడు సూచించారు. ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీని తగ్గించాలని కోరారు.

చిత్రం... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్