బిజినెస్

అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 10: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఐటీ స్టాక్స్ అధికంగా లాభపడ్డాయి. సెనె్సక్స్ 168.62 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 52.05 పాయింట్లు లాభపడి 11,900 మార్కును తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఆక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టాటాస్టీల్ అత్యధికంగా 2.39 లాభపడ్డాయి. మరోవైపు ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ అత్యధికంగా 2.89 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల తీరు మెరుగుపడటంతోబాటు వాణిజ్య యుద్ధ తీవ్రత తగ్గినందువల్ల మదుపర్లు సానుకూలంగా స్పంచారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మెక్సికో ఉత్పత్తులపై సుంకాలు పెంచాలన్న ప్రతిపాదనను అమెరికా విరమించుకోవడం అంతర్జాతీయ మార్కెట్ టెన్షన్లకు కొంత ఉపశమనంగా మారిందని అంటున్నారు. కాగా బీఎస్‌ఈలో 350 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్ చివరిగా 168.62 పాయింట్ల ఆధిక్యతతో 0.43 శాతం లాభపడి 39,784.52 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,979.48 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 39,619.97 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ 52,05 పాయింట్ల ఆధిక్యతతో 0.44 శాతం లాభపడి 11,922.70 గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీసైతం ఒక దశలో 11,975.05 పాయింట్ల గరిష్టాన్ని, తర్వాత 11,871.75 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే షాంఘై కాంపోజిట్ సూచీ 0.86 శాతం లాభపడగా, హాంగ్‌కాంగ్ సూచీ 2.27 శాతం, నిక్కీ 1.20 శాతం వంతున ఆధిక్యతను నమోదు చేశాయి. అలాగే కోస్పి 1.31 శాతం లాభపడింది. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభలనే నమోదు చేశాయి.
తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 9పైసలు తగ్గి రూ 69.55గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సైతం స్వల్పంగా తగ్గి బ్యారెల్ 63,23 డాలర్ల వంతున ట్రేడైంది.