బిజినెస్

ప్రాంతీయ భాషల్లో అమెజాన్ ప్రైమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమెజాన్ ప్రైమ్ ఇక మీదట ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని అమెజాన్ ఇండియా ప్రైమ్ మెంబర్ గ్రోత్ అండ్ ఎంగేజ్‌మెంట్ హెడ్ సుబ్బు ఫళనియప్పన్ తెలిపారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హిందీలో ప్రైమ్ ప్రసారాలు చేస్తున్న అమెజాన్ ఇక మీదట అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అమెజాన్ ప్రైమ్ ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. విశాఖపట్నం, విజయవాడ, కడప, చిత్తూరు, కర్నూలు, రాజమండ్రి తదితర పట్టణాల్లో అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులు షాపింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు విస్తృతంగా ఆస్వాదిస్తున్నారన్నారు. నెలకు రూ.129 లేదా సంవత్సరానికి రూ.999 నామమాత్రపు సభ్యత్వంతో ఖాతాదారులకు అమెజాన్‌ప్రైమ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైమ్ ఖాతాదారులకు ఎంటర్‌టైన్ మెంట్ సేవలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో పలు ప్రయోజనాలు కల్పించబడ్డాయన్నారు.
రూ.500లోపు అమెజాన్ ఉత్పత్తుల కొనుగోలుపై డెలివరీ ఛార్జీలు పూర్తి ఉచితంగా అందుతున్నాయన్నారు. ప్రైమ్ సభ్యులు విమాన టికెట్ల కొనుగోలుపై కేష్‌బ్యాక్ పొందుతున్నారని, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిక్ కార్డు కలిగిన వారికి 5 శాతం ప్రత్యేక బోనస్ లభిస్తోందని వెల్లడించారు. ప్రైమ్ సభ్యులు కొనుగోలు చేసే వస్తువులు 24 గంటల నిర్ణీత వ్యవధిలోనే డెవివరీ జరుగుతోందన్నారు. అమెజాన్‌కు ఏపీలో బలమైన డెలివరీ నెట్‌వర్క్ ఉందని, సుమారు 200 ఉత్పత్తులపై అమెజాన్‌కు యాజమాన్య హక్కులు ఉన్నయని తెలిపారు. రాష్ట్రంలో అమెజాన్‌కు 8500 మందికి పైగా అమ్మకందార్లు ఉండగా, విశాఖ నగరంలోనే సుమారు 1700 మంది ఉన్నారన్నారు. గృహోపకరణాలు, తదితర ఉత్పత్తులతో సేవలందుతున్నాయన్నారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
అమెజాన్ ప్రైమ్ మార్కెటింగ్ హెడ్ ఫళనియప్పన్