బిజినెస్

యాభై శాతమూ ఆమోదయోగ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 11: భారత ప్రధాని మోదీతో త్వరలో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు దిగుమతి సుంకాల విషయంలో భారత్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. అమెరికా దేశపు చిహ్నంలా పేరొందిన ప్రఖ్యాత హార్లీ డేవిడ్సన్ మోటారు బైక్‌లపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకం ‘ఆమోదింపదగ్గది కాదు’ అని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ సుంకాన్ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించిన భారత్‌ను ఓవైపు మంచి స్నేహితుడిగా పేర్కొంటూనే ట్రంప్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జపాన్‌లో ఇటీవల జరిగిన జీ-20 దేశాల ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధుల శిఖరాగ్ర సదస్సును కొనసాగింపుగా ఈనెల 28,29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకోలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఏ దేశంతోనైనా ఉన్న సంబంధాలను తమ దేశ ఆర్థికాభివృద్ధి దృష్టితో ముడిపెట్టి చూస్తున్న ట్రంప్ భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా గతంలో అభివర్ణించిన సంగతి తెలిసిందే. భారతీయ ఉత్పత్తుల దిగుమతులపై కూడా తాము ఇదే రకమైన ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిని అవలంభిస్తామని, అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరించడం కూడా విధితమే. ఐతే ఆ తర్వాత హార్లీ డేలిడ్‌సన్ బైక్‌లపై సుంకాన్ని వంద శాతం నుంచి 50 శాతానికి తగ్గించిన భారత ప్రధాని మోదీకి ఆయన మంచి స్నేహితుడిగా కితాబివ్వడం, తామూ కూడా భారత్‌పై ఎలాంటి అదనపు సుంకాలు విధించబోవడం లేదని ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఐతే తాజాగా ఆయన హార్లీడేలిడ్సన్ బైక్‌లపై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయాలన్న సరికొత్త డిమాండ్‌ను ఇప్పుడు తెరపైకి తెచ్చారు. 50 శాతం సుంకం సైతం ‘ఆమోదయోగ్యం కాదు’ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సుంకాలపై ఉన్న వివాధాన్ని పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలూ సంప్రదింపులు సాగిస్తున్నాయని ట్రంప్ నాడిక్కడ తెలిపారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు అమలు చేస్తోందని మంగళవారం ఆయన మళ్లీ ఆరోపణల రాగం అందుకున్నారు. ‘మా బలం ఏమిటో నిరూపించుకోలేకపోతే మా బ్యాంకులు ఖాళీ అవుతాయి. అవి ఉన్నది అందరూ దోచుకుపోవడానికి కాదు’ అని ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ఎంతోకాలంగా కొన్ని దేశాలు అమెరికా పట్ల అదే వైఖరిని అనుసరిస్తున్నాయ’ని అన్నారు. ‘ఇతర దేశాలతో అమెరికాకు దాదాపు 800 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యపరమైన నష్టాలున్నాయ’ని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇవన్నీ ఎవరు చేశారో మీరు చెప్పగలరా?’ అని విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఎదురు ప్రశ్న వేశారు.