బిజినెస్

నీరవ్ మోదీ వస్తే.. ముంబయిలో జైలు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 11: కోట్లాది రూపాయిల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముంబై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టిసారించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఆయన కోసం ప్రత్యేకంగా ముంబయి ఆర్దర్ రోడ్డు జైల్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖ ముంబయి హోం మంత్రిత్వ శాఖకు గత వారం సమాచారం వెల్లడించింది. పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని స్కాట్‌లాండ్ యార్డు అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, నీరవ్‌పై ఉన్న కేసుల నేపథ్యంలో ఇంగ్లాండ్ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అంటోంది. లండన్‌లో ఖైదీలతో కిటకిటలాడే హెర్ మెజెస్టీస్ వాండ్స్‌వర్త్ జైలులో ప్రస్తుతం నీరవ్ మోదీ కటకటాల ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ లండన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తే.. ముంబై జైలులో ఆయన్ను పెట్టాల్సి వస్తే ఆర్ధర్ రోడ్డు జైలులో చేసిన ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర జైళ్ల శాఖ సమాచారాన్ని అందించింది. అలాగే, లండన్‌కు పలాయనం చిత్తగించిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను భారత్‌కు వస్తే ఇదే జైలులో ఏర్పాట్లు సిద్ధం చేసింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచుతారు. జైలులోని 12వ బ్యారక్‌లో 20 అడుగుల వెడల్పు 15 అడుగుల పొడవు ఉన్న గదిని వీరి కోసం సిద్ధం చేశారు. మూడు ఫ్యాన్‌లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని జైళ్ల శాఖ పేర్కొంది.