బిజినెస్

ఢిల్లీ-చైనా మధ్య ఇండిగో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: తక్కువ ధరకు ఢిల్లీ-చైనాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ముందుకు వచ్చింది. ఢిల్లీ-చెంగ్డుల మధ్య సెప్టెంబర్ 15 నుంచి ప్రతి రోజూ నాన్-స్టాప్ విమానాలను నడపనున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియం బౌల్టర్ తెలిపారు. ఇది ఇండిగో చరిత్రలో మరో కీలక ఘట్టం అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా విమానయాన మార్కెట్‌లోని ఇండిగో ప్రవేశం వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానయానానికి సంబంధించి రావాల్సిన అనుమతులు లభించగానే ఢిల్లీ-చెంగ్డుల మధ్య విమానాల రాకపోకలకు టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో ఇండిగో ముందడుగు వేస్తున్నదన్నారు. ఇక దేశంలోని డొమిస్టిక్ విమానాల్లో ప్రయాణికులకు అత్యధిక సేవలందిస్తున్నామని, డొమిస్టిక్ ప్రయాణికుల్లో 50 శాతం మంది ఇండిగో ప్రయాణికులే ఉన్నారని ఆయన వివరించారు.