బిజినెస్

‘నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వలేం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 12: భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి బెయిల్ ఇచ్చేందుకు లండన్ హైకోర్టు బుధవారం నిరాకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రెండు బిలియన్ డాలర్ల మేర మోసగించిన కేసుతోబాటు మనీల్యాండరింగ్ కేసులో నిందితుడైన నీరవ్ మోదీ భారత్ నుంచి పారిపోయి వచ్చి బ్రిటన్‌లో తలదాచుకుంటూ అక్కడి పోలీసులకు దొరికి జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అతన్ని అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను అంగీకరించవద్దంటూ నీరవ్ న్యాయపోరాటం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా తనను బెయిల్‌పై విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈక్రమంలో ఇక్కడి రాయల్ కోర్టు ఆఫ్ జస్టిస్‌లో బుధవారం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఇన్‌గ్రిడ్ సిమ్లర్ మాట్లాడుతూ నీరవ్ మోదీని బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ సరెండర్ అవుతాడన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. సాక్షులను ప్రభావితం చేసి న్యాయానికి విఘాతం కలిగించే అవకాశాలున్నాయన్నారు. అంతకు ముందు నీరవ్ మోదీకి చెందిన న్యాయవాదుల బృందం బెయిల్ కోసం న్యాయమూర్తిని ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు సాగించింది. గతంలో బెయిల్‌ను మూడు సార్లు నిరాకరించిన వెస్‌మినిస్టర్స్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాల్సిందిగా వాదనలు వినిపించింది. 48 ఏళ్ల నీరవ్ మోదీ బెయిల్ కోసం సమర్పించిన హామీ పత్రాలు కూడా సరిగా లేవని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అతన్ని బెయిల్‌పై విడుదల చేయడం రిస్క్ అవుతుందని, అతను తిరిగి కోర్టుకు సరెండర్ అవుతాడని విశ్వసించలేకపోతున్నామని అన్నారు. గత మార్చి 19న సెంట్రల్ లండన్‌లోని మెట్రో బ్యాంక్ శాఖా కార్యాలయంలో స్కాట్‌ల్యాండ్ యార్డ్ ఆఫీసర్లు ‘ భారత్‌కు అప్పగింత వారెంట్’ ఆధారంగా నీరవ్ మోదీని అరెస్టు చేయగా అప్పటి నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.