బిజినెస్

11 ఏళ్లలో బ్యాంకుల నష్టం రూ. 2.05 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో బ్యాంకులను మోసం చేసిన సంఘటనలు 50,000 వరకు ఉన్నాయి. వీటి మొత్తం నష్టం రూ.2.05 లక్షల కోట్ల పైమాటే. భారత రిజర్వు బ్యాంకు అందించిన వివరాల ప్రకారం.. ఇటీవలకాలంలో బ్యాంకుల మోసాలు విపరీతంగా పెరిగాయి. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. 2008-09 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో 53,334 కేసులు నమోదైనట్టు ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఈ మోసాల వెల్లువ 2 లక్షల కోట్లకు పైమాటగానే ఉంది. భారీగా నష్టపోయిన బ్యాంకుల్లో ఐసీఐసీఐది అగ్రస్థానం. ఈ బ్యాంకు 5,033.81 కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది. 6,811 కేసులను దాఖలు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ 6,793 ఫ్రాడ్ కేసుల్లో 23,734.74 కోట్ల రూపాయలు నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 8,497 కేసుల్లో 1,200.79 కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూసింది. ఓ వ్యక్తి ఆర్‌టీఐ చట్టం ప్రకారం అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ పూర్తి వివరాలను అందజేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 2,160 ఫ్రాడ్ కేసుల్లో 12,962.96 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2,047 కేసుల్లో 28,700.74 కోట్ల రూపాయలు, యాక్సిస్ బ్యాంక్ 1,944 కేసుల్లో 5,301.69 కోట్ల రూపాయలు చొప్పున నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,872 ఫ్రాడ్ కేసుల్లో 12,358.20 కోట్ల రూపాయలు చేజార్చుకుంది. సిండికేట్ బ్యాంక్ 1,783 కేసుల్లో 5,230.85 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,613 కేసుల్లో 9,041.98 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ 1,264 కేసుల్లో 5,978.96 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 1,263 కేసుల్లో 1,221.41 కోట్లు, కెనరా బ్యాంక్ 1,254 కేసుల్లో 5,553.38 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,244 కేసుల్లో 11,830.74 కోట్ల రూపాయలు చొప్పున నష్టపోయాయి. అదేవిధంగా మోసాలకు గురైన బ్యాంకుల్లో కోటక్ మహీంద్ర (430.46 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (12,644.70 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (5,598.23 కోట్లు), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3,052.34 కోట్లు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (742.31 కోట్లు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా (1,178.77 కోట్లు) ఉన్నాయి. ఇవేకాక, లక్ష్మీ విలాస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, సిటీ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, విజయా బ్యాంక్, ఎస్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కూడా మోసాలకు గురయ్యాయి. వాణిజ్య బ్యాంకులు 6,801 కేసుల్లో 71,542.93 కోట్ల రూపాయలు నష్టపోయాయి.