బిజినెస్

స్తబ్దుగా ముగిసిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం స్తబ్థత నెలకొనగా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఎస్ బ్యాంక్ పెద్ద స్థాయిలో నష్టపోయింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులే ఇందుకు కారణమని విశే్లషకులు పేర్కొన్నారు. తొలుత దాదాపు 300 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ చివరికి 15.45 పాయింట్ల స్వల్ప నష్టంతో 39,741.36 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ తొలుత 39,461.27 పాయింట్ల కనిష్టానికి తర్వాత 39,800.81 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 7.85 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,914.05 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడింది. రోజంతా ఈ సూచీ తొలుత 11,817.05 పాయింట్ల కనిష్టాన్ని, తర్వాత 11,931.35 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంకు అత్యధికంగా 12.96 శాతం నష్టపోయింది. ఈ బ్యాంకు వరుసగా రెండోరోజు నష్టాల పాలవడం గమనార్హం. ప్రైవేటు రంగ బ్యాంకుల రేటింగ్ తగ్గే అవకాశాలున్నాయన్న మూడీస్ అధ్యయన నివేదిక మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేసింది. దీంతో మదుపర్లు ఆచితూచి అడుగేశారు. ఈక్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి, వేదాంత, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ 4.96 శాతం నష్టపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ రెండు కంపెనీలు 1.54 శాతం స్వల్ప లాభాలను సంతరించుకున్నాయి. ఇలావుండగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, చర్చలు కొనసాగే అవకాశాలు లేవన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లలో స్తబ్ధత నెలకొందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే తొలుత భారీ నష్టాలు నెలకొన్నా ఆ తర్వా త మదుపర్ల వైఖరిలో సానుకూల దృక్పథంతో నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం బుధవారం స్టాక్ మార్కెట్ల సమయం ముగిసిపోయిన తర్వాత వెలువడిన ఫ్యాక్టరీల ఫలితాలు లాభదాయకంగా ఉండటమేనని అంటున్నారు. భారత పారిశ్రామికాభివృద్ధి గత ఏప్రిల్‌లో ఆరునెల గరిష్టం 3.4 శాతాన్ని తాకింది. ప్రధానంగా గనులు, విద్యుత్ ఉత్పాదక రంగాల్లో గణనీయంగా అభివృద్ధి నెలకొందని నివేదికలు వెల్లడించాయి. అలాగే రీటైల్ రంగం కూడా గడచిన మేనెలలో ఏడు నెలల గరిష్టం 3.05 శాతానికి పెరిగింది. ఇది ఆర్బీఐ నిర్ధేశిత సంతృప్తికర స్థాయి కావడం విశేషం. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ స్వల్పంగా లాభపడగా, హాంగ్‌సంగ్, నిక్కీ, కోస్పి నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఐరోపా స్టాక్ ఎక్చేంజ్‌లు ఆరంభంలో లాభాలతో సాగాయి.
బలహీన పడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 16 పైసలు తగ్గి మొత్తం రూ. 69.51లుగా ట్రేడైంది. అలాగే ముడి చమురు థరలు 3.54 శాతం పెరిగి బ్యారెల్ 62.09 డాలర్లు పలికింది. గల్ఫ్‌లోని ఓమెన్‌లో ఒక భారీ చమురు ట్యాంకర్‌పై దాడులు జరిగాయని, అలాగే మరో భారీ చమురు ట్యాంకర్ ప్రమాదానికి గురైందన్న ఆందోళనకర వార్తలు రావడం చమురు ధరలు భారీగా పెరిగేలా చేసిందని విశే్లషకులు పేర్కొంటున్నారు.