బిజినెస్

భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: అమెరికా చర్యకు ప్రతీకార చర్యగా ఆ దేశానికి చెందిన 29 ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాదం, ఆక్రూట్‌లతో సహా వివిధ రకాల పప్పు దినుసుల దిగుమతులపై సుంకాల పెంపును ఈనెల 16 నుంచి అమలు చేయాలని విశ్వసనీయ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఓ నోటిపికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో విడుదల చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నిమార్లు డెడ్‌లైన్లు విధించినా సుంకాలపై చర్చలకు అమెరికా స్పందించకపోవడం వల్ల ప్రతీకార చర్యగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ కస్టమ్స్ డ్యూటీలు పెంచడం వల్ల మన దేశానికి 217 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం చేకూరుతుంది. ఈక్రమంలో ఈ 29 వస్తువులను అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి చేస్తున్న వారు చిన్నబుచ్చుకునే అవకాలున్నాయి. ఇలావుండగా భారత్‌కు చెందిన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచిన అమెరికా వైఖరికి ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ 29 అమెరికా ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను పెంచాలని 2018 జూన్ 21న నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేయడం కూడా జరిగింది. అయినా ఆ వైపునుంచి స్పందన లేదని తెలిసింది. గడచిన ఏడాది మార్చిలో అమెరికా భారత్‌కు చెందిన అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై 25 శాతం, ఉక్కుపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. మనదేశ ఎగుమతుల్లో అధిక శాతం ఈ రెండు ఉత్పత్తులే ఉండటంతో అమెరికా నిర్ణయం వల్ల భారత్‌కు పన్ను చెల్లింపుల రూపంలో 240 మిలియన్ డాలర్ల అదనపు భారం పడే ప్రమాదం నెలకొంది. దీంతో దీనిపై చర్చలు జరిపి ఓ సమగ్ర వాణిజ్య ప్యాకేజీని ఇరుదేశాలకు ఆమోదంగా రూపొందించుకునేందుకు పలుమార్లు అమెరికాను భారత్ ఆహ్వానించడం జరిగింది. తేదీలూ సూచించడం జరిగింది. ఐతే అమెరికా ‘జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెనె్సస్’ (జీఎస్‌పీ) కార్యక్రమం ద్వారా మనదేశ ఎగుమతులపై ఇస్తున్న సుంకాల రాయితీని తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో ఇరుదేశాల వాణిజ్య సంప్రదింపులకు విఘాతం ఏర్పడింది. ఇక మరోమార్గం లేని భారత్ అమెరికా చర్యకు ప్రతిచర్యగా 29 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచే నిర్ణయానికి వచ్చింది.