బిజినెస్

చివరి అర్ధగంట.. నష్టాల బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజైన శుక్రవారం సైతం నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి. తొలుత 400 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత సల్పంగా కోలుకొని 289.29 పాయింట్లు కోల్పోయి 0.73 శాతం నష్టాలతో 39,452.29 పాయింట్ల వద్ద దిగువన స్థిరపడింది. ప్రత్యేకించి మార్కెట్ వారం ముగిసిపోయే ముందు చివరి అర్ధగంటలో పెద్దయెత్తున వాటాల అమ్మకాల వత్తిడి నెలకొంది. ఈక్రమంలో రోజంతా తీవ్ర ఊగిసలాటకు గురైన ఈ సూచీ ఒక దశలో 39,799.90 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 39,799.90 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 90.75 పాయింట్లు కోల్పోయి 0.76 పాయింట్ల నష్టంతో 11,823.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సైతం ఒక దశలో 11,823.30 పాయింట్ల దిగువకు, మరో దశలో 11,911.85 పాయింట్ల ఎగువకు చేరింది. ఈ వారం సైతం రెండు దేశీయ సూచీలూ నష్టాలు మూటగట్టుగట్టుకున్నాయి. మొత్తం వారం రోజుల్లో సెనె్సక్స్ 163.83 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సైతం 47.35 పాయింట్లు కోల్పోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ప్రధానంగా ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టాటామోటార్స్, ఆక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, హీరో మోటోకార్ప్ అత్యధికంగా 4.36 శాతం నష్టపోయాయి. మరోవైపు వారం రోజుల మార్కెట్ ప్రతికూలతలను అధిగమించి ఎల్ అండ్ టీ, సన్‌పార్మా, వేదాంత, పవర్‌గ్రిడ్, టీసీఎస్ 0.80 శాతం లాభపడ్డాయి. కేపిటల్ గూడ్స్, బీఎస్‌ఈలోని రంగాల వారీ సూచీలు సైతం నష్టాలనే నమోదు చేశాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ ప్యాక్‌లో గృహనిర్మాణ, టెలికాం, బ్యాంకెక్స్, వాహన, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు 2.11 శాతం నష్టాలను నమోదు చేశాయి. కాగా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు చల్లారకపోవడంతోబాటు, గల్ఫ్‌లోని ఓమెన్‌లో రెండు భారీ ఆయిల్ ట్యాంకర్లపై గురువారం జరిగిన దాడుల అనంతరం అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ప్రభావమే దేశీయ మార్కెట్లపైనా పడిందని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలే మొత్తం వారం రోజుల మార్కెట్ స్థితిగతులను నిర్ధేశించాయని అంటున్నారు. చైనా వృద్ధి రేటు గణాంకాలు సైతం 17 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉండటం ప్రపంచ ఆర్థికాభివృద్ధి దుస్థితికి అద్దం అపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే రుతుపవనాల ప్రభావంపైనా మదుపర్లు నిశిత పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. ఈక్రమంలోనే గత రెండు రోజులుగా 4 శాతం వృద్ధిని నమోదు చేసిన ముడిచమురు ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్‌పై 0.11 శాతం ధర తగ్గి 61.24 డాలర్లు వంతున ట్రేడైంది. ఆసియా ఖండంలో టోక్యో (జపాన్) స్టాక్స్ లాభాల్లో సాగగా, షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.