బిజినెస్

ఆర్థిక వృద్ధికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్ని ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను ఇనుమడింపజేసే దిశగా ఓ పటిష్టమైన రోడ్ మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్‌కు ముందే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు కీలక విభాగాలకు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఈ రోడ్ మ్యాప్‌కు సంబంధించి ఈ నెల 20న వీరితో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని సమావేశం కారణంగా ఈ నెల 20న జరగాల్సిన జీఎస్‌టీ మండల సమావేశాన్ని ఒక రోజుకు వాయిదా వేశారు. ప్రతి విభాగానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉందని, అలాగే రెవెన్యూను పెంపొందించుకోవడం జీడీపీ వృద్ధి రేటు వేగాన్ని పెంచేందుకు వీలుగా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై కూడా మోదీ దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో జీడీపీ వృద్ధి రేటు తగ్గిన నేపథ్యంలో ఈ అంశంపైనే ప్రధాని చర్చ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019-20 వార్షిక బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తలపెట్టిన ఈ కీలక భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరింది. రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం వంద రోజులు కాల వ్యవధిని నిర్ణయించుకుని, దానికి అనుగుణంగానే లక్ష్యాలను నిర్ధేశించుకునే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన లక్ష్యాల అజెండాను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖలను పీఎంవో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ వ్యయం, ఆర్థిక సర్వీసులు, దీపం వంటి విభాగాలు ఉన్నాయి. ప్రధాని జరిపే సమావేశాల్లో ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు, ద్రవ్యోల్భణానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ విభాగం, పన్నులను పెంచేందుకు చేపడుతున్న చర్యలను, అలాగే జీఎస్‌టికి చెందిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక వ్యయ విభాగం ప్రత్యక్ష నగదు బదిలీ ఖాతాకు సంబంధించిన ఆదాయాల గురించి ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలకు జరిపిన కేటాయింపుల గురించి వివరిస్తుంది.