బిజినెస్

వాణిజ్య యుద్ధ భయంతో దేశీయ మార్కెట్లు బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇండో- అమెరికా వాణిజ్య యుద్ధం భయంతో సోమవారంనాడు దేశీయ మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 491 పాయింట్లు పతనంకాగా, (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 151 పాయింట్లకు దిగజారింది. దీనికితోడు కీలక రంగ షేర్లు కుదేవలడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వాణిజ్య యుద్ధం ఆందోళనలతో సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈలో లోహ రంగం 3 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. అదేవిధంగా ఎనర్జీ 2 శాతం పైగా దిగజారింది. సెనె్సక్స్‌లో టాటాస్టీల్ 5 శాతానికి పైగా నష్టాన్ని ఎదుర్కొంది. అదేవిధంగా వేదాంత, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, మారుతి అండ్ ఎల్ అండ్ టీ సైతం సుమారు 3.33 శాతం నష్టపోయాయి. అదేసమయంలో ఎస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ పుంజుకున్నాయి. ఇదిలావుండగా, బీఎస్‌ఈ 491.28 పాయింట్లు దిగజారి 38.960.79 వద్ద స్థిరపడింది. ఇండెక్స్ ఇంట్రా అతి తక్కువగా డే 38.911.49 వద్ద, అత్యధికంగా 39.540.42 వద్ద నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151.15 పాయింట్లు తాకి, 11.672.15 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో ఇండెక్స్ అత్యల్పంగా 11,657.75 వద్ద, అత్యధికంగా 11,844.05 వద్ద నిలదొక్కుకున్నాయి. భారత్‌కు చెందిన స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై వాషింగ్టన్‌లో ఎక్కువ టారిఫ్‌లు విధించడంతో దాని ప్రభావం అమెరికా వాణిజ్య ఉత్పత్తులైన ఆల్మండ్, వాల్‌నట్, పప్పులు వంటి 28 రకాలపై కస్టమ్స్ పన్ను భారత్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.