బిజినెస్

సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జూన్ 19: భారత్-అమెరికా దేశాలు సహజసిద్ధమైన మిత్రులని, ఎలాంటి సవాళ్లనైనా సమష్టిగా ఎదుర్కొంటాయని భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (ఐఏసీసీజీహెచ్) 20వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య విడదీయలేని సంబంధం ఉందని అన్నారు. మనిషికి, మనిషికి మధ్య అవగాహన ఏర్పడడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండు దేశాలు ఒకేరకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ప్రపంచ వాణిజ్యరంగంలో చైనా ఆధిపత్యం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి సమస్యలు ఇరు దేశాలకు ఒకేరీతిలో ఉన్నాయని కెన్ జస్టర్ అన్నారు. అందుకే ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ఇరు దేశాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ‘సిద్ధాంతపరంగా చూస్తే ఏ రెండు దేశాల మధ్య శాశ్వత మిత్రత్వంగానీ, శతృత్వంగానీ ఉండవు. అదేవిధంగా శాశ్వత సమస్యలు అంటూ ఏవీ ఉండవు. సమయానుకూలంగా నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. అయితే, అమెరికా-్భరత్ మధ్య సుదీర్ఘకాలంగా ఈ సంబంధాలు మరింతగా బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సమస్యలు, సవాళ్ల అంశంలో చాలా సారూప్యత ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి వాణిజ్యపరమైన అంశాలపై ఇరు దేశాల ఒకే రీతిలో సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఆర్థిక, సామాజిక, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.