బిజినెస్

ఎస్‌ఈసీఐ, ఎన్టీపీసీ వివాదంపై త్రిసభ్య కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ముగ్గురు సభ్యులతో కూడిన డిస్ప్యూట్ రిజల్యూన్ కమిటీ (డీఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాలు, ఇతరత్రా అవగాహన పత్రాలకు అతీతంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ నివేదిక ఇస్తుందని ఎంఎన్‌ఆర్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. సౌర, వాయు విద్యుత్ ఉత్పాదన సంస్థలు ఇలాంటి కమిటీల ఏర్పాటు గురించి చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు తాత్సారం చేస్తూ వచ్చిన కేంద్రం ఇపుడు ఎస్‌ఈసీఐ, ఎన్టీపీసీ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం ఈ రెండు కంపెనీల అంశాలను మాత్రమే కాకుండా సౌర, వాయు విద్యుత్ ఉత్పాదనల రంగంలోని వివిధ అంశాలను కూడా చర్చిస్తుంది. ఈ క్రమంలో ఎదురవుతున్న అనేకానేక సమస్యలు, సవాళ్లను సమర్ధంగా విశే్లషిస్తుంది. మార్గాంతరాన్ని చెబుతూ నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఒక విధాయక నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.