బిజినెస్

ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన జెట్ ఎయర్‌వేస్ ఉద్యోగుల సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 19: జెట్ ఎయిర్‌వేస్ దివాళా ప్రక్రియలో తమను కూడా పార్టీలుగా చేర్చాలని ఆ సంస్థ పైలట్‌లు, ఇంజనీర్ల సంఘంతో పాటు రెండు డచ్ సంస్థలు సైతం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం ఆశ్రయించాయి. దీనిపై ట్రిబ్యునల్ గురువారం విచారణ ప్రారంభించనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 26 బ్యాంకుల కన్సార్టియం కూడా జెట్ ఎయిర్‌వేస్ దివాళా ప్రక్రియలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంగళవారం ముంబయిలోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌కు పిటిషన్ సమర్పించిన సంగతి తెలిసిందే. తమకు జెట్ ఎయిర్‌వేస్ నుంచి రావల్సిన ఎనిమిది వేల 500 కోట్ల బకాయిలను రికవరీ చేయించాల్సిందిగా బ్యాంకుల కన్సార్టియం ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ను కోరింది. జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల సంఘంతో పాటు రెండు డచ్ సంస్థలు తమ పిటిషన్ ఆమోదించాలని ఆయా ప్రతినిదులు ఎన్‌సీఎల్‌టీని కోరుతున్నాయి.
జెట్ ఎయిర్‌వేస్‌లోని మూడువేల మంది సిబ్బందికి మార్చి నుంచి ఇంతవరకు మూడు వేల కోట్లు కంపెనీ రుణపడి ఉంది. వీరితో పాటు తమకు రావాల్సిన బకాయిలు 8.74 కోట్లు, 53 లక్షలను జెట్ నుంచి రికవరీ చేయాల్సిందిగా షామన్ వీల్స్, గగ్గర్ ఎంటర్‌ప్రైజెస్ కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి.