బిజినెస్

చైనా స్థిరాస్తి రంగంలో స్తబ్దత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 22: నిన్న మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన చైనా స్థిరాస్తి మార్కెట్‌లో ఇప్పుడు స్తబ్దత నెలకొంటున్న సూచనలు కనిపిస్తుండడంతో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు ప్రదాన చోదకశక్తులుగా ఉండిన ఈ రంగం సంక్షోభ దిశకు మళ్లుతుందేమోనన్న భయాలు విధాన రూపకర్తల్లో తలెత్తుతున్నాయి. గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్నింటిలో మాత్రమే కొత్త నివాసాల ధరలు పెరిగాయని, మిగతా చోట్ల వీటి ధరలు పడిపోతున్నాయని స్పష్టమవుతోంది. సర్వే చేసిన 75 మధ్య తరహా నగరాల్లో కేవలం 51 నగరాల్లో మాత్రమే కొత్త నివాసాల ధరలు పెరిగాయని జాతీయ గణాంకాల బ్యూరో(ఎన్‌బిసి) తెలిపింది. జూన్ నెలలో ఈ సంఖ్య 55 కాగా, మే నెలలో 60గా ఉంది. అంతకుముందు నెలతో పోలిస్తే 16 నగరాల్లో కొత్త ఇళ్ల ధరలు పడిపోయాయి.
గత వారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలో స్థిరాస్తులపై పెట్టుబడులు కేవలం 5.3 శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో ఈ రంగంలో పెరుగుదల 6.1 శాతం కాగా, తొలి అయిదు నెలల్లో 7 శాతం వృద్ధి నమోదయింది. ఇదే సమయంలో ఆస్తుల అమ్మకాల్లో వృద్ధి సైతం తగ్గుముఖం పట్టింది. ఓ వైపు ఈ రంగం గాలి బుడగలాగా ఎక్కడ పేలిపోతుందోనని భయపడుతున్న అధికారులకు ఈ స్తబ్దత కాస్త ఊరటనిస్తే మరో వైపు స్థిరాస్తి రంగం జవజీవాలను కోల్పోతూ ఉందేమోనన్న భయాలు సైతం కలుగుతున్నాయి. గత ఏడాది ప్రారంభంలో మోదలైన స్థిరాస్తి రంగం రికవరీ అప్పటివరకు జారుడు మెట్లపై ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ కొంతమేరకైనా పుంజుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి. అయితే ప్రధానంగా పెద్ద నగరాల్లో నివాసాల ధరలు భారీగా పెరగడం ఇది ఎక్కడ పేలిపోతుందనే భయాలకు కూడా కారణమైంది.