బిజినెస్

దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ ప్రధాన అంశాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ చెప్పారు. శనివారం ఏఐఎఫ్‌టిపి ఆధ్వర్యంలో దేశంలోని ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, న్యాయవాధులు, ఆడిటర్స్‌కు పన్నలపై రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సును స్థానిక ప్రైవేట్ హోటల్లో ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల ప్రయోజనాలపై నిరంతర అధ్యయనం అవసరమన్నారు. పన్నుల చెల్లింపు అనేది అనాదిగా వస్తోందన్నారు. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఉన్నాయని వాటిని మనదేశం జిఎస్టీ ద్వారా అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రత్యక్ష పన్నులు ఇన్‌కమ్‌టాక్స్ అని ఇది 1860 నుండి అమల్లో ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టే పన్నులకు అకౌంటబిలిటీ ప్రధానమని చెప్పారు. ఎకానమీ వల్ల ఆర్థికాభివృద్ధి, ఫైనాన్స్ ప్రజలు చెల్లించే పన్నులు పబ్లిక్ మనీ మానిటర్, రెవెన్యూ ఆదాయ మార్గాలు ఈ మూడు ప్రజాస్వామ్యంలో ప్రధాన ఘట్టాలన్నారు. పన్నుల వల్ల సామాజికాభివృద్ధి, సామాజిక న్యాయం దేశానికి అందుతుందన్నారు. పన్నుల పాలసీపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పారు. వస్తువుల ధరలు మరీ తక్కువగా ఉంటే దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం ఉంటుందని, ఎక్కువగా ఉంటే అవినీతికి దారితీసేలా ఉంటుందన్నారు. పన్నుల పాలసీ విధానంలో అవగాహన కలిగి, బెనిఫిట్స్ అందించేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. నేడు మనదేశంలో అమలులో ఉన్న జీఎస్టీ సెంట్రల్, స్టేట్, ఇంటిగ్రేట్, యూనియన్ టెరిటోరీ విధానంలో జీఎస్టీ అమలులో ఉందని చెప్పారు. పన్నుల మినహాయింపు అనేది కూడా దేశాభివృద్ధిలో భాగమేనని ప్రజాసేవ సంఘాలకు, వెనుబడిన ప్రాంతాలకు దిగుమతులు, ఎగుమతులపై రాయితీలు వంటివి ఉంటాయని ఆయన చెప్పారు. ఈ జాతీయ సదస్సులో ఎంతోమంది తమ అనుభవాలను పంచుకోవడం, పన్నులలో ఉన్న సాధక బాధలపై పారదర్శకంగా చర్చించి కేంద్రానికి వాటిని సమర్పించగలిగితే నూతన విధానాల అమలుకు అవకాశం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మానవునికి రక్తం ఎలాగో దేశానికి పన్నులు అలాగని అన్నారు. నూతన రాష్ట్రంలో కొత్తగా హైకోర్టు వచ్చిందని ఇలాంటి సదస్సులు అమరావతిలో చేపట్టాలని సూచించారు, న్యాయవాదులు, చార్టర్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌కు ఇది ఉపయోగకరమన్నారు. ఈసందర్భంగా సభలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీసనర్స్ సావనీర్ లోగాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఎం.గంగారావు, సీతారామ మూర్తి, యు.దుర్గాప్రసాదరావు, కె.విజయలక్ష్మి ప్రత్యేక అహ్వానితులగా హాజరై ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ షరాఫ్, సెక్రటరీ జనరల్ ఆనంద్ పాసారి, సౌత్‌జోన్ చైర్మన్ బిఎస్ సీతాపతి రావు, సౌత్‌జోన్ సెక్రటరీ సి.సంజీవ రావు, జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస రావు, ఏపీటీపీసీఏ అధ్యక్షుడు ఎవిఎస్ కృష్ణహోహన్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఎం.మహెబూబ్ బాషా, తిరుపతి అధ్యక్షుడు ఎస్.నాగభూషణం, అలాగే శ్రీ్ధర్, పి.పార్థసారథి, టి.చంద్రవౌళి, కె.సునీల్‌కుమార్, పి.వి.సుబ్బారావు, డాక్టర్ ఎంవికె మూర్తి పాల్గొన్నారు.
చిత్రం...తిరుపతిలో జరిగిన నేషనల్ టాక్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రసంగిస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్