బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 25: రుతుపవనాలు సకాలంలో వచ్చి వ్యవసాయం సానుకూల పడుతుందన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా లాభపడ్డాయి. ప్రధానంగా విద్యుత్, వాహన, బ్యాంకింగ్ స్టాక్స్ మంచి లాభాలను అందుకున్నాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 311.98 పాయింట్లు ఎగబాకి 0.80 శాతం లాభాలతో 39.434.94 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 96.80 పాయింట్లు లాభపడింది. కాగా ఉదయం నుంచి సెషన్‌లో అధిక భాగం నష్టాల్లో సాగిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఒక దశలో 350 పాయింట్లు ఎగబాకింది. ఇంట్రాడేలో ఈ సూచీ తొలుత 39,490.64 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 38,946.04 కనిష్టాన్ని తాకింది. కాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.83 శాతం లాభంతో 11,796.45 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,814,40 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 11,651 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 2.63 శాతం లాభపడింది. అలాగే ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటాస్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ సైతం 2.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఎస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ ఎం, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హీరోమోటో కార్ప్, హెచ్‌సీఎల్ టెక్ దాదాపు 1.70 శాతం నష్టపోయాయి. ఇలావుండగా ఆరంభంలో నష్టాలను సంతరించుకున్న స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారత వాతావరణ శాఖ అందజేసిన రుతుపవనాల సమాచారంతో కోలుకున్నాయి. రుతుపవనాలు ఇప్పటికే దాదాపు సగం దేశంలో వ్యాపించాయని, వార్షిక వర్షపాతం సమృద్ధిగా జరుగుతుందని, ఈవారం దేశంలోని మధ్య, పటమటి ప్రాంతాలకు సైతం రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మధ్యాహ్నం తర్వాత మదుపర్లలో సానుకూల దృక్పథం నెలకొందని విశే్లషకులు భావిస్తున్నారు. అందుకే ఒక్కసారిగా సూచీలు ర్యాలీని ప్రదర్శించాయని అంటున్నారు,
విదేశీ మార్కెట్లు డీలా
షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. అలాగే ఐరోపా ఈక్విటీ మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను సంతరించుకున్నాయి. ఇక అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువలో పెద్దగా మార్పేమీ లేదు. ఇంట్రాడేలో డాలర్‌కు 69.36 రూపాయలుగా ట్రేడైంది. కాగా ఇక ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 0.36 శాతం తగ్గి బ్యారెల్ 63.95 డాలర్ల వంతున ట్రేడైంది.