బిజినెస్

8 నుంచి 10 శాతం వృద్ధి రేటుతోనే భారత్‌లో ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 25: భారత్ ఆర్థికాభివృద్ధిని ప్రతిఏటా 8 నుంచి 10 శాతానికి తగ్గకుండా చూసుకుంటేనే కొత్తగా ఉద్యోగావకాశాలను, ఉన్నత జీతభత్యాలను కల్పించేందుకు వీలుంటుందని ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు అరవింద్ పనగారియా మంగళవారం నాడిక్కడ అభిప్రాయపడ్డారు. ఎగుమతుల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించే అంశంపై భారత్ ప్రధాన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా పనగారియా పనిచేశారు. భారత్ ఆర్థికాభివృద్ధి వాణిజ్యంపై ఆధారపడి ఉందని, పలు రకాల ఉత్పత్తులపై సుంకాలు పెరుగుతున్న ఈ దశలో ప్రభుత్వం దీనిపై బహిరంగంగా వైఖరిని తెలియజేయాల్సి ఉందని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా సరళీకృత వాణిజ్య విధానం రావడంతో 2000 సంవత్సర ప్రాంతంలో భారత్ వాణిజ్యపరంగా అనూహ్యంగా విస్తరించనారంభించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎగుమతుల్లో అంతర్జాతయంగా అగ్రగామి కావడానికి భారత్‌కు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం పనగారియా కొలంబియా విశ్వవిద్యాలయం భారత ఆర్థికాభివృద్ధి విధానాల విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003 నుంచి సుమారు 15 ఏళ్ల కాలంగా భారత్ వృద్ధిరేటు 7 శాతం కంటే అధికంగా సాగుతుండటం హర్షించదగిన అంశమని పనగారియా పేర్కొన్నారు. ప్రత్యేకించి గత ఐదేళ్ల మోదీ పాలనలో 7.5 శాతం వృద్ధిరేటు వచ్చిందని, ఇది 8 నుంచి 10 శాతానికి పెరిగితేకానీ యువతకు మంచి ఉద్యోగాలు కల్పించడానికి వీలుండదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ప్రధాన సమస్య ఉద్యోగాల కల్పన కాదని, సరైన జీతభత్యాల కల్పనేనని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ప్రధానంగా వ్యవసారంగంలో 44 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నప్పటికీ వారికి అందుతున్నది అతి తక్కువ వేతనాలేనని ఆయన ఉదహరించారు.