బిజినెస్

నిరర్థక ఆస్తులను తగ్గించుకునేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో నిరర్థక ఆస్తులు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అనుసరించాల్సిన మార్గాలను అనే్వషించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే నెల 16వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సాధించిన పురోగతితో పాటు రుణ సామర్ధ్యం పెంపు, మొండి బకాయిల పరిస్థితిపై సెప్టెంబర్ 16వ తేదీన జైట్లీ సమీక్ష జరుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. రుణ వసూళ్లను వేగవంతం చేసేందుకు బ్యాంకులు, ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.43 శాతం (రూ.2.67 లక్షల కోట్లు)గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 2015-16లో 9.32 శాతానికి (రూ.4.76 లక్షల కోట్లకు) పెరగగా, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇవి 10.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని దేశ ఆర్థిక స్థిరతపై విడుదల చేసిన తాజా నివేదికలో రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) స్పష్టం చేసింది. దీంతో మొండి బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులను తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికంలో తమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అనేక బ్యాంకులు పేర్కొన్నాయి. ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తో పాటు అనేక బ్యాంకుల స్థిరీకృత లాభాలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,714 కోట్లుగా ఉన్న ఎస్‌బిఐ స్థిరీకృత ఆదాయం ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,046 కోట్లకు పడిపోయింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర అనేక బ్యాంకుల లాభాలు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో వాటి రుణ సామర్ధ్యం రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో రుణ సామర్ధ్యాన్ని పునరుద్ధరించేందుకు ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబి) సహా 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది తొలి విడతగా 22,915 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది.