బిజినెస్

రూ. 95 వేల కోట్ల ఇన్‌ఫ్రా బాండ్ల సేకరణ: ప్రభుత్వ యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 95,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను స్పెషల్ పర్సస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ద్వారా సమీకరించనుందని, ఇది 0.5 శాతం జీడీపీతో సమానమని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించనున్నా అది మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపబోదని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్‌కు చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా ప్రజావసరాల కోసం జారీ కానున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు లేకుండానే అభివృద్ధికి ఊతమిచ్చినట్టు అవుతుంది’ అని ఆ బ్యాంక్‌కు చెందిన అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిధంగా దేశవ్యాప్తంగా 95,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్‌ఫ్రాస్టక్చర్ బాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులను సేకరించనుంది. ఎస్‌పీవీ కింద ప్రజలు బాండ్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే దాని ప్రభావం బ్యాంకు డిపాజిట్లు లేదా రుణ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఫిక్సిడ్ డిపాజిట్ల సొమ్మును సర్దుబాటు చేయడం వల్ల వాస్తవంగా నష్టం 4,700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.