బిజినెస్

అక్రమార్కులపై కఠిన చర్యలు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: అక్రమ ఎగుమతిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌ఐఈవో) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అమాయకులెవరూ నష్టపోకుండా చూడాలని సంస్థ అధ్యక్షుడు గణేష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఎగుమతి దారులపై కేంద్రం తీసుకునే ఈ నిర్ణయానికైనా ఎఫ్‌ఐఈవో సంపూర్ణ మద్దతు ఇస్తుందని బుధవారం ఆయన ప్రకటించారు.‘అక్రమ వ్యాపారాలతో పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందే. అలాగే అమాయకులెవరికీ నష్టం జరగకూడదు’అని గుప్తా వీడియాతో అన్నారు. బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి సర్వీస్ టాక్స్‌లు ఎగ్గొట్టిన 5,106 మంది ఎగుమతి దారులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. బోగస్ ఇన్‌వాయిస్‌లతో జీఎస్టీ రిఫండ్స్ పొందినట్టు గుర్తించింది. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఎఫ్‌ఐఈవో అధ్యక్షుడు బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ దేశంలో 1.42 మంది ఎగుమతి దారులున్నట్టు వెల్లడించారు. అందరూ అక్రమార్కులే కాదన్న ఆయన తప్పుచేసిన వారిని శిక్షించాల్సిందేనని అన్నారు. ‘కొద్ది మంది ఎగుమతి దారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులను తప్పుదోవపట్టించారు’అని అన్నారు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు ఒకటికి పదిసార్లు పరిశీలించి నిజమైన ఎగుమతిదారులనే ప్రోత్సహించాలని గుప్తా కోరారు.