బిజినెస్

లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: వరుసగా రెండోరోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 157.14 పాయింట్లు (0.40 శాతం) పెరిగి, 39,592.08 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 51.10 పాయింట్లు (0.43శాతం) లాభపడి 11,847.57 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడంతో బీఎస్‌ఈలో లావాదేవీలు బుధవారం ఆశాజనకంగానే ప్రారంభమయ్యాయి. రోజు మొత్తంలో అత్యధికంగా 39,674.22 పాయింట్లు, అత్యల్పంగా 39,319.64 పాయింట్లు నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో కూడా నిఫ్టీ అత్యధికంగా 11,871.85, అత్యల్పంగా 11,757.55 పాయింట్లు నమోదు కాగా, మధ్య మార్గంగా ముగిసింది. సెనె్సక్స్‌లో బుల్న్ భారీగా లేకపోయినా లాభాల్లోనే కొనసాగింది. వేదాంత షేర్లు అత్యధికంగా 4.40 శాతం పెరిగాయి. అదే విధంగా పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీల షేర్ల ధర సగటున 4.12 శాతం పెరిగింది. అయితే, ఇన్ఫోసీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, మారుతి, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
వీటి ధర సగటున 1.12 శాతం పడిపోయింది. మెటల్, పవర్, హెల్త్‌కేర్ తదితర రంగాలు లాభాలను ఆర్జించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ఆర్థిక నివేదికల ముగింపు తేదీ సమీపిస్తుండడంతో స్టాక్ మార్కెట్లు కొంత వరకు ఒడిదుడుకులకు లోనయ్యాయి. కాగా, అమెరికా రక్షణ మంత్రి మైక్ పొంపియోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి జయశంకర్ ద్వైపాక్షిక సంబంధాలపై జరిపిన చర్చల ఫలితాలు సానుకూలంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి.