బిజినెస్

జెమ్స్, జువెలరీపై దిగుమతి సుంకం తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: జూవెలరీ(నగలు), జెమ్స్(రత్నాలు) దిగుమతి సుంకాన్ని 4 శాతం తగ్గించాలని రంగం కోరుతోంది. స్మగ్లింగ్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవల్సిందిగా అఖిల భారత జెమ్స్, జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) విజ్ఞప్తి చేసింది. బంగారంపై పది శాతం దిగుమతి సుంకం విధించాలని జీజేసీ కోరింది. సంస్థ బుధవారం నాడొక ప్రకటన చేస్తూ ‘ స్మగ్లింగ్, చీకటి మార్కెట్‌ను పూర్తిగా నిరోధించేందుకు రత్నాలు, జువెలరీపై దిగుమతి సుంకం 4 శాతం తగ్గించాని మా సంస్థ ఏకగ్రీవంగా కోరుతోంది’అని చైర్మన్ అనంత పద్మనాభన్ వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుక పరిశ్రమకు బ్యాంకు కమిషన్ 0.20 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. క్రెడిట్ కార్డుపై 11.5 శాతం కమిషన్‌ను బ్యాంకులు విధిస్తున్న విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. కమిషన్‌ను 0.20 శాతం తగ్గించడం ద్వారా వ్యాపారాభివృద్ధి పెరుతుందని అలాగే ఖాతాదారులను ఆకట్టుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కాపిటల్ గెయిన్ టాక్స్‌లోనూ వెసులుబాటు కల్పించాలని అసోసియేషన్ తీర్మానించింది. అలాగే జెమ్స్, జువెలరీ పరిశ్రమకు ఈఎంఐ సదుపాయం పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు జీజేసీ విజ్ఞప్తి చేసింది. పాన్ కార్డ్ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని అనంత పద్మనాభన్ సూచించారు.‘ఒక మంగళ సూత్రం,నాలుగు గాజులు, ఓ చిన్న ముక్కుపుడక, పెళ్లికొడుకు-పెళ్లి కుమార్తె ఉంగరాలు కలిపి కనీసం వంద గ్రాములు బంగారం ఉంటుంది. ఎంత లేదన్నా వాటి విలువ మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల పైమాటే. చాలా మంది మధ్యతరగతి వాళ్లకు పాన్ కార్డు సదుపాయమే ఉండదు. వ్యవసాయదారులకు పాన్ కార్డు ఉండదు. ఈ పరిస్థితుల్లో జువెలరీ కొనుగోలుకు పాన్ పరిమితి రెండు లక్షలు ఉండాలన్న నిబంధనం సరైందికాదు. దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలి’అని జీజేసీ డిమాండ్ చేసింది. పదిశాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్, జువెలరీ ఎగుమతి ప్రోత్సాహక కౌన్సిల్(జేపీఈపీసీ) బడ్జెట్‌కు ముందే కోరింది. పాలిష్డ్ డెమండ్స్‌పై విధిస్తున్న 7.5 శాతం దిగుమతి సుంకం 2.5 శాతానికి తగ్గించాలని సంస్థ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ సూచించారు.