బిజినెస్

రేషన్ షాపుల మనుగడ ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూన్ 26: దేశంలో అతిపెద్ద ప్రజాపంపిణీ వ్యవస్థ కలిగిన మన రాష్ట్రంలో ఇకముందు రేషన్ షాపు ఉంటుందా, రద్దవుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల చెంతకు నేరుగా రేషన్ సరుకులు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దశాబ్దాల చరిత్ర ఉన్న రేషన్ షాపులపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రేషన్ డీలర్లలో సర్వత్రా ఆందోళన నెలకొంది. 1947 జూన్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మొదట్లో రేషన్ షాపుల ద్వారా గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్ సబ్సిడీపై పంపిణీ చేసేవారు. తరువాత పలు నిత్యావసర వస్తువులను అందిస్తున్న రేషన్ షాపులకు రోజురోజుకూ మంచి ఆదరణ పెరిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే డీలర్లకు ప్రభుత్వం కమీషన్ అందిస్తుండటంతో ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి ఏటా మార్పులు, చేర్పులు జరుగుతూ వస్తున్న రేషన్ షాపులకు ఒక రూపం కల్పించింది మాత్రం నందమూరి తారకరామారావు మాత్రమే. 1983లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ రేషన్ షాపుల ద్వారా రెండు రూపాలయలకే కిలో బియ్యం పథకం ప్రారంభి, డీలర్లకు మంచి కమీషన్ కూడా అందించారు. ప్రస్తుతం క్వింటా బియ్యం పంపిణీ చేసినందుకు రూ.100లు, కిలో కందిపప్పు, చక్కెర పంపిణీ చేసినందుకు ఒక రూపాయిని ప్రభుత్వం వీరికి చెల్లిస్తోంది. రానురాను మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేషన్ షాపులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. బియ్యం సబ్సిడీపై ఇస్తున్న సమయంలో వీటికి ఆదరణ కూడా మరింత పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగన నేపథ్యంలో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్‌తో పాటు క్యాష్‌లెస్ వంటివాటిని కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. క్యాష్‌లెస్ విధానం విఫలం కావడంతో ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. గతంలో 5 నుండి 8వరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే షాపుల్లో నేడు కేవలం బియ్యం, చక్కెర, కందిపప్పు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2354 రేషన్ షాపుల ద్వారా సుమారు 13 లక్షల మంది రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది.
స్టాక్‌పాయింట్లగా మారతాయా?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు త్వరలోనే స్టాక్‌పాయింట్లగా మారే సూచనలను కనిపిస్తున్నాయి. గ్రామ వలంటీర్ల ద్వారా సెప్టెంబర్ 1 నుండి రేషన్ సరుకులను నేరుగా కార్డుదారుడి ఇంటికే అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులు స్టాక్‌పాయింట్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. ఇప్పటికే తహశీల్దారు కార్యాలయాల వద్ద డీడీలు చెల్లిస్తున్న డీలర్లు నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు అందిస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న వలంటీర్లు కార్డుదారులకు రేషన్ నేరుగా అందించే క్రమంలో డీలర్ల వద్ద నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఉందని డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ఏళ్లు రేషన్ షాపులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది కుటుంబాలు షాపులు ఎత్తివేస్తే రోడ్డున పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్గాన్ని అనుసరించవచ్చని అంటున్నారు. వలంటీర్ల ద్వారా సెప్టెంబర్ 1 నుండి రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముందుగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించి, తరువాత ప్యాకింగ్ విధానానికి శ్రీకారం చుట్టనుంది. దీనిలోభాగంగా 5, 10, 15 కిలోల బియ్యం ప్యాకింగ్ సంచులను తయారు చేస్తున్నారు. ప్యాకింగ్ మిషనరీని అధికారులు తెప్పిస్తున్నారు. ప్యాకింగ్ చేసేందుకు 7 నుండి 9 పాయింట్లను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 30 నాటికి స్టాక్‌పాయింట్ల ఎంపిక, బ్యాగుల తరలింపు ప్రక్రియ పూర్తికానుంది. సెప్టెంబర్ 1 నుండి వలంటీర్ల ద్వారా నేరుగా కార్డుదారుడికే రేషన్ సరుకులు అందించనున్నారు.