బిజినెస్

అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం లేనట్టే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 29: అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీజిపింగ్ వాణిజ్య లావాదేవీల కొనసాగింపునకు అడుగులు ముందుకేసి చర్చలు జరిపారు. జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన ‘జి-20’ దేశాల సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లేనని చైనాకు చెందిన ఓ మీడియా పేర్కొంది. చైనా దిగుమతులపై కొత్తగా, అధిక మొత్తంలో పన్నులు విధించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని కూడా తెలిపింది. చైనా కంపెనీల పట్ల న్యాయమైన వైఖరిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నామని జీజిపింగ్ ట్రంప్‌తో అన్నారని వివరించింది. ఇకమీదట ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం ఉపయోగించుకోవాలని, సత్సంబంధాలూ కొనసాగించుకోవాలని వారిరువురు భావించినట్లు వెల్లడించింది. దీంతో గత ఏడాది కాలంగా పరస్పరం పోటాపోటీగా విధించుకున్న వందల కోట్ల ట్యారిఫ్‌ల నుంచి విముక్తి లభించినట్లేనని పేర్కొంది. చైనా నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులపై కొత్తగా పన్నులేవీ విధించబోమని ట్రంప్ హామీ ఇచ్చినట్లు కూడా ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ట్యారిఫ్‌లపై తాము వెనక్కి తగ్గుతామని, వ్యవసాయ ఉత్పత్తులను చైనా తమకు ఎగుమతి చేస్తుందని ఆశిస్తున్నామని ట్రంప్ జీజిపింగ్‌తో అన్నట్లు తెలిపింది.
ఇక పూర్వాపరాల్లోకి వెళితే.. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య సఖ్యత దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఇదివరకే చైనా నుంచి దిగుమతి అయిన 250 బిలియన్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధించారు. ఇంకా దిగుమితి అయ్యే 300 బిలియన్ల విలువైన వస్తువులపైనా మరో 25 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరిక జారీ చేయడంతో చైనా వాణిజ్య వ్యాపారులు హతాశులయ్యారు. అయితే ఇప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదం కావడంతో వాణిజ్య వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చైనా ప్రకటించింది. అయితే ఇరు దేశాల అధ్యక్షుల చర్చలకు ముందు ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందాలు 11 పర్యాయాలు చర్చలు జరిపితే గానీ చర్చలు కొలిక్కి రాలేదు.
జీ జిపింగ్ హర్షం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదం అయ్యాయని చైనా అధ్యక్షుడు జీజిపింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తమ రెండు దేశాల మధ్య కొనసాగిన వాణిజ్య ఒప్పందాల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం చూపిందన్నారు. ఇప్పుడు పూర్వ సంబంధాలను కొనసాగించడానికి తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పరస్పరం సహకరించుకుంటామని, అది ఇరు దేశాల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని ఆయన చెప్పారు. విబేధాలతో సాధించేది ఏమీ లేదని, పైగా నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తమ రెండు దేశాల మధ్య సుహృద్భావమైన వాతావరణం నెలకొందని తెలిపారు. ట్రంప్ తనతో చాలా సన్నిహితంగా ఉంటున్నారని, తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నారని, అధికారిక లేఖల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నామని జీజిపింగ్ వివరించారు. మున్ముందు కూడా తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయన్న పూర్తి బలమైన నమ్మకం తనకు ఉందని, తద్వారా రెండు దేశాలకు ప్రయోజనం చేకూరి మరింత అభివృద్ధిని సాధిస్తాయని జీజిపింగ్ అన్నారు. అయితే అమెరికా నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం కొసమెరుపు.
అడుగు వేసేందుకు
సిద్ధంగా ఉన్నాం: ట్రంప్
ఇలాఉండగా ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ తమతో కలవాలనుకున్నట్లయితే తాను సైనికులు లేని ప్రాంతంలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కిమ్‌తో చర్చలు జరిపేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
ఆగ్రహించిన ట్రంప్
ఒసకాలో జరుగుతున్న జి-20 సుదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ సౌదీలో ఓ జర్నలిస్టు హత్య జరగడం పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనిని ఎవరూ ఎందుకు ఎత్తి చూపలేదని ఆయన ప్రశ్నించారు. రాజరికాన్ని ట్రంప్ తూర్పారబట్టారు. ట్రంప్ తన ప్రసంగంలో జిమ్మి కార్టర్ మంచి వ్యక్తి అని పొగుడుతూనే అమెరికా అధ్యక్షునిగా భయంకరమైన వ్యక్తిగా పేరొందారని అన్నారు.
రష్యా-సౌదీ ఒప్పందం
ఇలాఉండగా పెట్రోలియం తదితర వస్తువుల ఎగుమతుల విషయంలో రష్యా, సౌదీ అరబ్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తమ దేశాల్లో లభ్యత తక్కువగా ఉన్న ఆయిల్ తదితర వస్తువుల ఎగుమతి కోసం ఓ అంగీకారానికి వచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాడ్‌మీర్ పుతిన్ తెలిపారు.