బిజినెస్

నిధుల బదిలీ ఇక ఈజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 30: బ్యాంకుల నుంచి రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ (ఎన్‌ఈఎఫ్‌టీ) ద్వారా లావాదేవీలు జరిపే వారికి రుసుంల బాధ ఇక తగ్గనుంది. ఆయా విధానాల ద్వారా లావాదేవీలు జరిపేవారికి సేవలను మరింత సరళతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులపై పడుతున్న అదనపు భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఆయా బ్యాంకులతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం నుంచి అమలు చేసేందుకు మార్గం సుమగమైంది. కొత్త విధానం ద్వారా ఎలాంటి అదనపు భారం లేకుండా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ విధానాల ద్వారా రెండు లక్షల రూపాయలు బదిలీ చేసే అవకాశం ఉంది. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ సునీల్ మెహతా తెలిపారు. దేశంలోని అతి పెద్ద జాతీయ బ్యాంకు ఎస్‌బీఐ ఎన్‌ఈఎఫ్‌టీ విధానం ద్వారా లక్ష రూపాయల నుంచి 5 రూపాయల వరకు చేసే బదలాయింపునకు రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేస్తోంది. అదేవిధంగా ఆర్‌టీజీఎస్ విధానం ద్వారా అంతే సొమ్మును బదలాయించాలంటే ఐదు రూపాయల నుంచి 50 రూపాయల వరకు వినియోగదారుడి భారం పడుతోంది. ఇదిలావుండగా, ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీజీ కన్నన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ ప్రస్తుతం ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఆయా బ్యాంకులు అనుసరిస్తున్న విధివిధానాలను పరిశీలించాలని సూచించింది. ఏటీఎంలలో సైతం నగదు విత్‌డ్రాపై ఇపుడున్న విధానాలను సవరించాలని గత ఎంతోకాలం నుంచి డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే.