బిజినెస్

జూన్‌లో రూ. 10,384 కోట్ల విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: గడచిన జూన్ మాసంలో విదేశీ మదుపర్లు (ఎఫ్‌పీఐలు) 10,384 కోట్ల రూపాయల నిధులను దేశీయ కేపిటల్ మార్కెట్లలో మదుపు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల కొనసాగింపు విధానంతో ఊహించిన విధంగానే వరసగా ఐదు నెలలపాటు మన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ మదుపర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) జూన్ నెలలో ఈక్విటీల్లోకి రూ. 2,271.74 కోట్లు మదుపు చేయగా, రూ.8,111.80 కోట్లు రుణ విభాగాల్లో మదుపుచేశారని 3డిపాజిటర్స్ డేటా2 గణాంకా లు వివరిస్తున్నాయి. దీన్నిబట్టి భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక రంగ సంస్కరణలను కొనసాగిస్తుందన్న విశ్వా సం మదుపర్లలో వ్యక్తమైందని సీనియర్ విశే్లషకుడు హిమాంశు శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. ఐతే ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు ఊహించిన స్థాయికం టే తక్కువగానే ఉన్నాయని, జూలై 5న ప్రవే శ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై వేచిచూసే వైఖరిని మదుపర్లు అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు. 2019లో జనవరి నుంచి ఇప్పటి వరకు రూ. 87,313.22 కోట్ల మొత్తాన్ని విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు మదుపుచేశారు. ఇందులో జనవరి మినహా మిగిలిన అన్ని నెలల్లో ఎఫ్‌పీఐలే అధికశాతం వాటాల కొనుగోలుదారులుగా ఉన్నారు. మే నెలలో రూ. 9.031.15 కోట్ల విలువైన వాటాలను ఎఫ్‌పీఐలు కొనుగోలు చేశారు. అలాగే ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు వంతున ఈక్విటీ, రుణ మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు మదుపు చేశారు. మార్చి తర్వాత పెట్టుబడుల వెల్లువ పెరిగింది. ఇందుకు కారణం సెంట్రల్ ఆనుసరిస్తున్న సంస్కరణల విధానమేనని విశే్లషకులు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ట్రెండు మారే అవకాశాలు కనిపించడం లేదని మరో మార్కెట్ విశే్లషకుడు వీకే విజయకుమార్ అభిప్రాయపడుతున్నారు. జూలై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ విదేశీ పెట్టుబడులను రాకపోకలను నిర్దేశిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో కురస్తున్న వర్షపాతం దీర్ఘకాలిక సగటుకన్నా తక్కువ స్థాయిలో ఉంది. ఇదీ మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.