బిజినెస్

రెండు శ్లాబులుగా జీఎస్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో ఇపుడున్న 5, 12, 18, 28 శాతం రెండు శ్లాబులుగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారంనాడు ఆయన ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ చేస్తూ జీఎస్టీ శ్లాబులు 12 శాతం, 18 శాతాలుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని 20 రాష్ట్రాలు ఇప్పటికే జీఎస్టీని 14 శాతానికి పైగా విధించడంతో ఆదాయంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు. ప్రత్యక్ష పన్నుల విధానంతో ద్రవ్యోల్బణం మందగించిందని, ఒకే శ్లాబు అమలు చేయడం అసాధ్యం కాబట్టే రెండు శ్లాబుల విధానం రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు చేయడం వల్ల ఏర్పడే లోటును భర్తీ చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు రెండు శ్లాబుల విధానంతో ఆర్థికపరంగా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ ఒక లేఖ రాశారు.
ఇదిలావుండగా, జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వినియోగదారులకు ఎన్నోరకాల వస్తు సామాగ్రి 18 శాతం, 12 శాతం, 5 శాతం రూపంలో లభిస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ గత రెండేళ్లుగా వివిధ పన్నులను తగ్గించడం వల్ల 90,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. లగ్జరీ వస్తువులతోపాటు ‘సిన్’ గూడ్స్‌పై మాత్రమే 28 శాతం వరకు పన్నులు విధిస్తున్నారని, మిగిలిన చాలా వస్తువులపై సున్నా నుంచి 5 శాతం వరకు శ్లాబులు ఉన్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేకొద్దీ ఇపుడున్న 12 శాతం, 18 శాతం శ్లాబ్‌లు ఒక్కటిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగేకొద్దీ ఇపుడున్న 12 శాతం, 18 శాతం శ్లాబులు మళ్లీ ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 2017-18 (జూలై నుంచి మార్చి వరకు) గల ఎనిమిది నెలల్లో నెలకు 89,700 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం మరో 10 శాతం పెరిగి 97,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చునని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ‘తొలి ఐదు సంవత్సరాల్లో 14 శాతం కచ్చితంగా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రతి రాష్ట్రం కూడా తమకు లభించే నష్టపరిహారం నుంచి ట్యాక్స్‌ల రూపంలో తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఇదిలావుండగా, రెండు శ్లాబుల విధానం అభివృద్ధి చెందుతున్న సంపన్న దేశాలకు మినహా అత్యధిక శాతం పేద, బడుగు, బలహీనవర్గాలు కలిగిన మన దేశంలో మాత్రం ఒకే పన్ను విధానం ఉండడం వల్ల మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం మందగించిందని, పేదలు వినియోగించే అనేకానేక వస్తువులపై ధరలు తగ్గాయని ఆయన అన్నారు. జీఎస్టీ అమలు చేయడం వల్ల దేశంలోని దాదాపు పలు రాష్ట్రాల ఆదాయం అంతకుముందు కంటే పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం... కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ