బిజినెస్

సంస్కరణలతోనే గత వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూలై 1: భారత ఆర్థిక రంగం తిరిగి బలమైన వృద్ధి రేటును సంతరించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను సకాలంలో అమలు చేయాలని, లేదంటే క్లిష్టతరమైన సవాళ్లు తప్పవని అంతర్జాతీయ అధ్యయన సంస్థ డీబీఎస్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా పెట్టుబడులు పెరిగేందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని సూచించారు. భారత్‌కు ప్రస్తుతం స్థిరమైన, బలమైన ప్రభుత్వంతోబాటు మంచి సమర్థత కలిగిన సెంట్రల్ బ్యాంకు ఉన్నాయని, సంస్కరణలపై ప్రధాన దృష్టి సారించి స్థూల వృద్ధిరేటు పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసేందుకు ఇదే మంచి తరుణమని ఆ నివేదిక సూచించింది. ప్రధానంగా సమగ్ర ధరల విధానంతో కూడిన ముందస్తు కసరత్తు (ఆర్‌ఐపీఈ)ను అనుసరించడం ద్వారా ప్రస్తుత వృద్ధిరేటు మందగమనాన్ని అధిగమించవచ్చని, ఈ విధానం కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు అమలు చేయాల్సిన అవసరం ఉందని డీబీఎస్ గ్రూప్ పరిశోధనా విభాగానికి చెందిన ఆర్థిక నిపుణులు రాధికారావు అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగం ఆరోగ్య ప్రదంగా సాగాలంటే కొత్త సంస్కరణలను తీసుకువచ్చి మరింత క్లిష్టతర పరిస్థితుల్లోకి వెళ్లడం కంటే ఇప్పటికే ప్రకటించిన అంశాలపై సంస్కరణలు అమలు చేయడం ఉత్తమ మార్గమని ఆమె చెప్పారు.
ఉదాహరణకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాళా, బ్యాంకుల మోసగింపుల నియంత్రణ చట్టం (ఐబీసీ) తదితరాలు అమలు పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా పటిష్టవంతంగా జరగాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. అలాగే గత ఐదారేళ్లుగా నెలకొన్న పెట్టుబడుల తీరును సమీక్షించి మరింత సానుకూలంగా మలుచుకునేందుకు కీలక నిర్ణయాలు అమలు చేయాల్సి ఉందని డీబీఎస్ సూచించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సవాళ్లు ఎదురుకాకుండా అధికారుల వ్యవహార శైలిలో సైతం మార్పు రావాలని సూచించింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతతలతోబాటు ‘బ్రెగ్జిట్’ ప్రభావం, అమెరికా రక్షణాత్మక వైఖరి, రేట్ల ఒడిదుడుకులు వంటి కారణాలతో అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ నెలకొన్న వాణిజ్య రంగ సమస్యలను చక్కదిద్దడంపై సైతం కేంద్రం దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. భారత్‌లో 2013 నుంచి సూక్ష్మ స్థాయి ఆర్థికాభివృద్ధి స్వల్పస్థాయిలో ఆరంభమైందని, ప్రస్తుత పద్దుల లోటు సైతం గత ఏడేళ్ల లాగే జీడీపీలో 3 శాతానికంటే తక్కువగా ఉండేందుకు అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.