బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలో 17.4 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జూలై 1: సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓ.బి వెలికితీతలో మెరుగైన అభివృద్ధి కనబరుస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగిసిన మొదటి నెలల కాలంలో 170.82 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, గత ఏడాది ఇదే కాలానికి చేసిన 145.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిపై 17.3 శాతం వృద్ధిని సాధించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో 1057.98 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసిన కంపెనీ గత ఏడాది ఇదే కాలంలో 989.47 లక్షల క్యూబిక్ మీటర్లపై 7 శాతం వృద్ధిని కనబర్చింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో సింగరేణి సంస్థ 57.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. గత ఏడాది జూన్‌లో సాధించిన 49.63 లక్షల టన్నులపై 15.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే బొగ్గు రవాణా విషయంలో జూన్ నెలలో 55.19 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగింది. గత ఏడాది జూన్ నెలలో చేసిన 52.72 లక్షల టన్నుల బొగ్గు రవాణాపై 4.7 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఓ.బి వెలికితీత విషయంలో జూన్ నెలలో 352.78 లక్షల క్యూబిక్ మీటర్లు తొలగించిన కంపెనీ గత ఏడాది జూన్‌లో తొలగించిన 277.14 లక్షల క్యూబిక్ మీటర్లపై 27.3 శాతం వృద్ధిని కనబర్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జూన్‌లో రెండు యూనిట్లు కలిపి 819.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 94.81 పీఎల్‌ఎఫ్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో సింగరేణి థర్మల్ కేంద్రంలోని రెండు యూనిట్ల ద్వారా 2437.38 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 2299.58 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల రీత్యా గ్రిడ్‌కు సరఫరా చేసింది.
లక్ష్యాల సాధనకు కృషి చేయండి
ఇదే ఒరవడిని కోనసాగిస్తూ వర్షాకాలంలో వచ్చే అవంతరాలను ప్రణాళికాబద్ధంగా అధిగమిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలసి సింగరేణి సీ అండ్ ఎండీ నడిమెట్ల శ్రీధర్ సింగరేణీయులకు పిలుపునిచ్చారు. అలాగే మంచి పి.ఎల్.ఎఫ్‌తో విద్యుత్ ఉత్పాదనను కోనసాగించాలని థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులను, ఉద్యోగులను కోరారు.
చిత్రం...సింగరేణి సీఎండీ శ్రీధర్