బిజినెస్

రవాణా శాఖ ఆదాయంలో రాష్ట్రానికి నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: రవాణాశాఖ ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పర్మిట్ ఫీజుల రూపంలోనే ఈ ఆర్థిక సంవత్సరం 2018-19లో 7 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆర్టీఏ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణాశాఖలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు నేరుగా మంత్రి పేఫీకి వచ్చే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తామన్నారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు ప్రత్యేకంగా ఈ-మెయిల్ అడ్రస్‌ను అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. అలాగే ఆర్టీయే మొబైల్ యాప్‌ను త్వరలో ప్రవేశ పెడుతామన్నారు. రవాణాశాఖలో పారదర్శక సేవలను అందించడానికి సంస్కరణలు ప్రవేశ పెడుతామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది 15 రోజులలో నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 2 లక్షల 30 వేల రిజిస్ట్రేషన్స్ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్డులను 15 రోజులలో జారీ చేయాల్సిందిగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్డుల ప్రింటింగ్ ఆగిపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయని అన్నారు. ఈ సమస్యను యుద్ధప్రాతిపదిక పరిష్కరించాలని ఆదేశించారు.