బిజినెస్

చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. సోమవారం చండ్రుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జాడి సురేందర్ తన వ్యవసాయ భూమిలో బోరు వేస్తుండగా బొగ్గు నిక్షేపాలు వెలువడ్డాయి. తన వ్యవసాయ బావిలో బోరు వేస్తున్న సందర్భంగా బోర్‌వెల్ నుండి నల్లటి నీటితో పాటు బొగ్గు పెల్లలు బయటకు వచ్చాయని సురేందర్ తెలిపారు. అన్నారం, చండ్రుపల్లి ఈ సమీపంలో విరివిగా బొగ్గు నిక్షేపాలు ఉన్న విషయం కొద్ది సంవత్సరాల క్రితమే సింగరేణి సంస్థ సూచించింది. తాజాగా తన వ్యవసాయ భూమి కోసం బోరు వేస్తున్న క్రమంలో బొగ్గుతో పాటు నల్లటి నీరు ఉబికిరావడంతో గ్రామస్థులు ఈ ప్రాంతంలో విరివిగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని సంబరంలో మునిగి తేలారు. 1994 నుండి 1997 మధ్యన సింగరేణి సంస్థతో పాటు ఓఎన్‌జీసీ సంస్థతో పాటు అల్ఫా కంపెనీ వారు మహదేవ్‌పూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లో చమురు నిక్షేపాల కోసం సర్వేలు చేపట్టారు. తాజాగా వెలువడిన సురేందర్‌కు చెందిన భూమిలో 40 ఫీట్ల లోతులో బొగ్గు కనబడింది. గతంలో సర్వేలు చేసిన సంస్థలు అప్పుడు నక్సల్స్ ప్రభావితం వల్ల మధ్యలోనే సర్వేలను నిలుపుదల చేశారు. 1994-97 మధ్యలో సింగరేణి సంస్థకు చెందిన సర్వే చేస్తున్న డెల్లార్లను నక్సల్స్ దహనం చేశారు. మహదేవ్‌పూర్ మండలంలోని చండ్రుపల్లి, అన్నారంతో పాటు కాటారం మండలంలోని నస్తూరుపల్లిలో సింగరేణి వారు నిక్షేపాల కోసం సర్వేలు చేపట్టి మావోల భయంతో విరమించుకున్నారు. తాజాగా వెలువడిన బొగ్గు, చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వం రీ సర్వే చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
చిత్రం...బోర్‌ వేస్తుండగా ఉబికి వచ్చిన బొగ్గు

*