బిజినెస్

విదేశీ రుణంతో నాలుగు ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో ఐదు ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు రుణాలతో అమలవుతున్నయని, మరో నాలుగు ప్రాజెక్టులకు రుణ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు రుణాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టుల గురించి రాజ్యసభలో కేవీపీ రామచందర్‌రావు, మహ్మద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పంపిన మరో 12 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు ఎన్డీబీ, ఏఐఐబీ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే అమరావతిలో వౌలిక వసతుల ఏర్పాటు కోసం రూ.1, 242 కోట్లతో కూడిన ప్రాజెక్టు ప్రతిపాదనలను జపాన్ ఆర్థిక సాయం కోసం పంపామని తెలిపారు. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం రూ.9, 988 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కూడిన ప్రాజెక్టు రుణ సహాయం చేయాలేమని కెగ్జిమ్ (ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ కొరియా) నిస్సహాయతను వ్యక్తం చేసిందని మంత్రి తెలిపారు. ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్ మెట్రోరైలు, నగర వీధుల పునరుద్ధరణ కోసం రూ. 960 కోట్లు ప్రాజెక్టు ప్రతిపాదనలను జర్మనీ రుణ సంస్థల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నీ గ్రామీణ రహదారులకు సంబంధించినవేనని మంత్రి పేర్కొన్నారు.