బిజినెస్

‘రెరా’లో నమోదు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: బిల్డర్లు, ప్రమోటర్లు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టరు చేసుకోకుండా ప్లాట్లు, భవనాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును విక్రయించేందుకు వీలు లేదని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు.
వైసీపీ రాజ్యసభ పక్షం నాయకుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బుధవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. రియల్ ఎస్టేట్ చట్టం- 2016 ప్రకారం ‘రెరా’ వద్ద రిజిస్టరు చేసుకోకుండా ఏ బిల్డరు లేదాప్రమోటరు తమ వెంచర్లను ప్రచారం చేసుకోవటం లేదా ఫ్లాట్లు, ప్లాట్లు విక్రయించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. వాటికి సంబంధించి కార్యకలాపాలను ఎటువంటి పరిస్థితిలో కూడా అనుమతించే ప్రసక్తేలేదని ప్రకటించారు. ‘రెరా’ చట్టం అమల్లోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్టు పూర్తయినట్టు జారీ చేసే ధృవీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు మాసాల వ్యవధిలో తమ ప్రాజెక్టును నమోదు చేయించుకోవాలని మంత్రి తెలిపారు. అలా రిజిస్టరు చేసుకునే బిల్డర్లు, ప్రమోటర్లు రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ‘రెరా’ చట్టంలోని సెక్షన్ 59 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా ప్రాజెక్టు అంచనా వ్యయంలో పది శాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్లు పురి స్పష్టం చేశారు. ‘రెరా’ వద్ద రిజిస్టరు కాని బిల్డర్ల వద్ద ఉన్న ప్లాట్లు కొన్న వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఎదురయితే ఫోరం వద్ద ఫిర్యాదు చేసి చట్టపరంగా తమ హక్కులను పరిరక్షించుకోవచ్చునని కేంద్ర మంత్రి సూచించారు. దేశంలో ఎన్ని గృహనిర్మాణ ప్రాజెక్టులు రెరా వద్ద రిజిస్టరు అయ్యాయనే వివరాలు తమ శాఖ సేకరించిందని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ గృహ నిర్మాణాల వివరాలు లభ్యమవుతాయని మంత్రి చెప్పారు.
ఊపందుకున్న కార్గో రవాణా
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సరుకుల రవాణా గణనీయంగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ ‘2017-18లో 257 మెట్రిక్ టన్నుల సరుకులు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రవాణా అయ్యాయి’ అన్నారు. 2018-19 నాటికి ఇది 669 మెట్రిక్ టన్నులకు చేరినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంలోని కార్గో హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ ఏడాదికి 20 వేల టన్నుల రవాణా సామర్థ్యం కలిగి ఉందని ఆయన చెప్పారు. ఎయిర్ కార్గో రవాణా కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు వీలు కల్పిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్ లైన్స్ సర్వీసులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు పురి చెప్పారు.