బిజినెస్

పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో మందగించిన పర్యాటక రంగాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నివేదికలు సూచించాయి. ఇందుకోసం ప్రభుత్వంతోబాటు వివిధ రంగాలు సమష్టి భాగస్వామ్యంతో కృషి చేయాలని సూచించింది. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ప్రధాన రంగాల్లో పర్యాటక రంగం కూడా ఒకటని, ప్రత్యేకించి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), విదేశీ మారక ద్రవ్య రాబాడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఈ రంగం ప్రభావితం చేస్తుందని సర్వే నివేదిక గుర్తు చేసింది. ఒకే రకమైన ఆశయాలు కలిగిన వివిధ మంత్రిత్వ శాఖలు, వాటాదార్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి పర్యాటక రంగ ప్రగతికి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్వే నివేదించింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పారద్రోలేందుకు పర్యాటక రంగాభివృద్ధి ద్వారా కృషి చేయవచ్చని, ఇందుకోసం ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులను సైతం పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. పర్యాటక రంగ ప్రగతికి ఊతమిచ్చే హోటళ్లు అన్ని టౌన్‌షిప్‌ల్లోనూ ఏర్పాటు చేసేందుకు స్థలాల కేటాయింపుజరగాలని, హోటల్ ప్రాజెక్టులకు ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్‌లు చేయాలని సర్వే సూచించింది. అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా నైపుణ్యాల వృద్ధికి తగిన శిక్షణను ఇప్పించడంతోబాటు, పన్ను విధానాన్ని కూడా సరళీకృతం చేయాలని సర్వే సూచించింది. దేశానికి విదేశీ పర్యాటకుల రాక గత ఏడాది 14.2 శాతం నుంచి 2.1 శాతం తగ్గిపోయిందని తెలిపింది. 2018- 19లో 10.4 మిలియన్ల పర్యాటకులు దేశాన్ని సం దర్శించగా, 2017-18లో 10.6 మిలియన్ల మంది సందర్శించారని వివరించింది. పర్యాటక రంగం ద్వారా సమకూరే విదేశీ మారక ద్రవ్య ఆర్జన సైతం 2017-18లో 28.7 మిలియన్ డాలర్ల నుంచి 2018-19లో 27.7 మిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని సర్వే నివేదిక వెల్లడించింది.